తాజా వార్తలు

Friday, 30 October 2015

రాష్ట్ర పెట్టుబడులపై చైనాబృందంతో పరస్పర అవగాహన

రాష్ట్రంలో పెట్టుబడులపై చైనాబృందంతో సీఎం కేసీఆర్  సుదీర్ఘంగా చర్చించారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో చేపట్టే వంతెనలు, టన్నెళ్లు, బహుళ అంతస్తుల భవన నిర్మాణాల్లో పెట్టుబడులు పెట్టేందుకు చైనా దేశానికి చెందిన పలు కంపెనీలు ముందుకొచ్చాయి. క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్‌ రావును చైనా కంపెనీల ప్రతినిధులు కలిసి, వివిధ అంశాలపై చర్చించారు. ముఖ్యమంత్రి ఇటీవలి చైనా పర్యటన తర్వాత, ఆ దేశపు పలు కంపెనీల ప్రతినిధులు హైదరాబాద్‌ సందర్శించినపుడు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడుల విషయమై పరస్పర అవగాహన కుదిరింది. ఈ నేపథ్యంలో చైనా కంపెనీల ప్రతినిధులు నీటి పారుదల శాఖ చేపట్టే ప్రాజెక్టుల ప్రతిపాదిత స్థలాన్ని, టన్నెళ్లు తవ్వాల్సిన ప్రాంతాలను, మూసి నదిపై నిర్మించతలపెట్టిన బ్రిడ్జి ప్రాంతాన్ని, హుస్సేన్‌ సాగర్‌ ఒడ్డున నిర్మించే అతిపెద్ద టవర్‌ ప్రతిపాదిత స్థలాన్ని సందర్శించారు. వీటికి సంబంధించిన మోడళ్లు, ప్రతిపాదనలు తయారు చేశారు. వాటిని ముఖ్యమంత్రికి సూచించారు. పాలమూరు ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించే టన్నెళ్లను తక్కువ సమయంలో, అత్యంత నాణ్యతతో పూర్తి చేస్తామని చైనా ప్రతినిధులు చెప్పారు. మూసీ నదిపై నిర్మించే బ్రిడ్జీకి సంబంధించి కూడా చర్చలు జరిగాయి. హైదరాబాద్ నగరంలో దుర్గం చెరువుపై సస్పెన్షన్ బిడ్జి కట్టడానికి సిసిసిసి హైవే కన్సల్టెన్సీ కంపెనీ ముందుకొచ్చింది. హుస్సేన్ సాగర్ ఒడ్డున భారతదేశంలోనే అతిపెద్ద టవర్ నిర్మించేందుకు అయ్యే వ్యయంలో 85 శాతం భరించడానికి బ్యాంక్ ఆఫ్ చైనా సంసిద్ధత వ్యక్తం చేసింది. త్వరలోనే మరోసారి సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటారు. చైనా బృందంలో బ్యాంక్ ఆఫ్ చైనా ఇండియా హెడ్ చివ్ హెంగ్ చాంగ్ ( QIV HENGCHANG), అంజు ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డైరెక్టర్ యోగేశ్ వా, ఇండియా హెడ్ మనోజ్ గాంధీ, సిసిసిసి మేనేజర్ పెంగ్ యన్ గాంగ్ ( PENG YUNDONG), బిజినెస్ మేనేజర్ చాంగ్ చున్ యుమాన్ ( CHANG CHUNYMAN), బీజింగ్ ZYTX బిజినెస్ మేనేజర్ వు హావ్ (WU HAO), రాడిక్ కన్సల్టెన్సీకి చెందిన జహీర్ అహ్మద్, రాజ్ కుమార్ వున్నారు. సమావేశంలో తెలంగాణ ప్రభుత్వ సీనియర్ అధికారులు నర్సింగరావు,శాంతికుమారి, అరవిందకుమార్, నర్సింహరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment