తాజా వార్తలు

Monday, 5 October 2015

రైతు సమస్యలపై చర్చ జరిగింది -సీఎం కేసీఆర్

రైతు సమస్యలపై అసెంబ్లీలో సుధీర్ఘ చర్చ జరిపామని సీఎం కేసీఆర్ చెప్పారు.  అంతేకాని సభజరగనివ్వం..ఇదే ఏక సూత్రం అంటే ఒప్పుకోమని స్పష్టం చేసారు. రెండు రోజులపాటు కొశ్చన్ అవర్ ను కూడ రద్ధు చేసి రైతుల సమస్యలపై చర్చించామన్నారు. దీనిపై ప్రభుత్వం ఏం చేయగలుగుతుందో అదే చెప్పామన్నారు. ప్రభుత్వ నిర్ణయం నచ్చకుంటే ప్రజాస్వామిక పద్దతిలో నిరసన తెలపవచ్చన్నారు.గత ప్రభుత్వాలు ప్రాజెక్టుల విషయంలో శ్రద్ధ చూపించలేదన్నారు మంత్రి హరీష్ రావు. పెండింగ్ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆయన చెప్పారు. రీ ఇంజినీరింగ్ తర్వాత 29లక్షల ఎకరాలకు నీళ్లు అందిస్తామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణ, పర్యావరణ అనుమతుల అంశాన్ని వేగవంతం చేస్తామని చెప్పారు. ఎల్లంపల్లి ముంపు గ్రామాలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నదన్నారు. శాసనసభలో ప్రశ్నోత్తారాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి హరీష్ రావు సమాధానం ఇచ్చారు.
« PREV
NEXT »

No comments

Post a Comment