తాజా వార్తలు

Friday, 16 October 2015

రైతు ఆత్మహత్యలపై హైకోర్టును ఆశ్రయించిన కోదండరామ్

తెలంగాణలో రైతు ఆత్మహత్యలపై ప్రతిపక్షాలు విమర్శలను ఎదుర్కొంటున్న ప్రభుత్వానికి మరో చిక్కు వచ్చి పడింది. కోదండరామ్‌ కూడా రైతు ఆత్మహత్యలపై హైకోర్టును ఆశ్రయించారు. రాజకీయ పార్టీలు చేస్తే...వారిపై కౌంటర్ ఎటాక్ చేయవచ్చు. కానీ ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన కోదండరామ్ కోర్టు కేసులో భాగస్యామి అవ్వటంతో ఏం చేయలేని పరిస్ధితి. పొలిటికల్ జేఏసీ ఛైర్మన్‌గా కోదండరామ్‌ని పెట్టిందే టీఆర్‌ఎస్‌... ఉద్యమంలో ఆయన్ని ముందుంచి నడిపించారు కేసీఆర్. రాష్ట్రం ఏర్పడ్డాక కొన్నాళ్లు సైలెంట్ గా ఉండిపోయిన కోదండరామ్...కేసీఆర్ ఏడాది పాలన తరువాత సమస్యల పై మాట్లాడటం మొదలుపెట్టారు. రైతుల ఆత్మహత్యలను ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదని.. స్వామినాధన్ కమిషన్ ఇచ్చిన సిఫారసుల్ని అమలుచేయాలని డిమాండ్‌ చేస్తున్నారు కోదండరామ్‌. ఇది ప్రభుత్వానికి కొంత ఇరకాటంలోకి నెట్టింది.  
« PREV
NEXT »

No comments

Post a Comment