తాజా వార్తలు

Monday, 26 October 2015

మోదీకి సిఫారసు చెసిన కె సి అర్...‘పథకాలు తగ్గించండి.. నిధులు పెంచండి’ అంటూ ప్రధానమంత్రికి ముఖ్యమంత్రుల సబ్‌కమిటీ ప్రతిపాదించనుంది. ప్రస్తుతమున్న 72 కేంద్ర ప్రభుత్వ ప్రథకాలను 30 పథకాలకు కుదించాలని సిఫార్సు చేయనుంది. ఈ ఏడాది మార్చిలో కేంద్ర ప్రభుత్వ పథకాల కుదింపుపై నీతి ఆయోగ్‌లో మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ నేతృత్వాన సీఎంల సబ్‌ కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. అందులో తెలంగాణ సీఎం కేసీఆర్‌ సభ్యుడిగా ఉన్నారు. ప్రస్తుతమున్న పథకాలపై అధ్యయనం చేసి.. మార్పు చేర్పులు, పథకాల అమలు సాధ్యాసాధ్యాలను పరిశీలించి పలు సిఫారసులు చేయడం ఈ కమిటీ పని. వీటన్నింటిపై పలుమార్లు చర్చించిన కమిటీ.. ప్రధాని మోదీకి మంగళవారం తుది నివేదికను సమర్పించనుంది. ఇక, ఆయా పథకాల కింద రాషా్ట్రలకుఇచ్చే నిధుల వాటాను 10ు నుంచి 25 శాతానికి పెంచాలని సూచించనుంది. 2016-17 ఆర్థిక సంవత్సరం నుంచి అమలుకు సిఫారసు చేయనుంది.
News Desk
« PREV
NEXT »

No comments

Post a Comment