Writen by
vaartha visheshalu
21:36
-
0
Comments
బీసీలను ఉద్ధరించడానికి ఆ సామాజికవర్గాల నుంచి వచ్చిన వారికి ఉపముఖ్యమంత్రి పదవిని ఇస్తాను.. వారికి రాజకీయంగా సహకారం అందిస్తాను... అని ప్రకటించిన చంద్రబాబు నాయడు వారి ముచ్చటకు ముగింపును ఇవ్వడానికి సిద్ధం అవుతున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో భాగంగా ఇద్దరు డిప్యూటీ సీఎంలను నియమించుకున్న చంద్రబాబు నాయుడు వారిలో ఒకరికి షాక్ ఇవ్వడానికి సిద్ధం అవుతున్నాడు.
ఇప్పటికే ఒక డిప్యూటీ సీఎం మినిస్టర్ కేఈ కృష్ణమూర్తి డమ్మీగా మారిపోయిన సంగతి తెలిసిందే. ఆయనకు కనీసం జిల్లాలో కూడా పట్టు లేకుండా చేశారు. అంతే కాదు.. ఆయనకు త్వరలోనే మరో షాక్ ఉండబోతోందని సమాచారం.
విశ్వసనీయ సమాచారం ప్రకారం ఉఫ ముఖ్యమంత్రి కేఈ చేతిలో ఉన్న రెవెన్యూ శాఖను పయ్యావుల కేశవ్ కు అప్పగించనున్నారట చంద్రబాబు నాయుడు. ఎమ్మెల్సీ హోదాలో ఉన్న పయ్యావులకు మంత్రి పదవి లభించడం ఖాయం అయ్యిందని తెలుస్తోంది. పదేళ్లుగా తను పార్టీ తరపున ఎన్నో పోరాటాలు చేశానని తనపై జాలి చూపాలన్న పయ్యావుల వినతితో బాబు స్పందిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆయనకు రెవెన్యూ శాఖను అప్పగించనున్నట్టుగా తెలుస్తోంది.
ప్రస్తుతానికి ఈ శాఖ కేఈ చేతిలో ఉంది. ఉప ముఖ్యమంత్రిగా ఆయన ఈ శాఖ బాధ్యతలు చూస్తున్నారు.కేబినెట్ లో రెవెన్యూ శాఖ అనేది ఒక శక్తిమంతమైన శాఖల్లో ఒకటి.
మరి ఇప్పుడు అది చేజారితే కేఈ చేతిలో డిప్యూటీ సీఎం అనే డమ్మీ హోదా మాత్రమే మిగులుతుంది. ఉప ముఖ్యమంత్రి ఉత్సవ విగ్రహంగా మిగిలిపోతారు.బీసీలకు డిప్యూటీ సీఎం పదవి అన్న తన హామీని బాబు ఈ విధంగా ఎసరుపెడుతున్నాడు. అయినా.. బలహీన సామాజికవర్గ నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తి నుంచి పదవిని లాక్కొని ఇలా ఒక కమ్మ వ్యక్తికి అప్పగించడం... విమర్శలకు దారితీసే అవకాశం ఉంది.అయినా.. అలాంటి విమర్శలను బాబు లెక్క చేయడనుకోండి!
News Desk-AP
No comments
Post a Comment