తాజా వార్తలు

Saturday, 24 October 2015

క్రిష్ తర్వాత ప్రాజెక్ట్ బారీగా వుంటుంది అంటా ....!దర్శకుడు  ఇప్పుడు ఓ భారీ సినిమాపై కసరత్తు చేస్తున్నట్లు వినికిడి. చేసిన జోనర్ లో సినిమా చేయకుండా వస్తున్న క్రిష్, తన తరువాతి సినిమా కోసం కాస్త వైవిధ్యమైన పరిశోధనే చేస్తున్నారట. ఇలాంటి భారీ సినిమాకు కాస్త గట్టి హీరోనే కావాలి. కథ మొత్తం పూర్తయ్యాక, హీరో ఎవరన్నది తెలుస్తుంది. క్రిష్ తో సినిమా చేయాలని రామ్ చరణ్ కుతూహలంగా వున్నాడు. మహేష్ కు కూడా క్రిష్ అంటే అభిమానమే.
అందువల్ల కథ సరైనది రెడీ అవ్వాలే కానీ, హీరో సమస్య రాదు. అంతకు ముందు కథ కన్నా కథ నేపథ్యం గురించి విస్తృతంగా గ్రౌండ్ వర్క్ చేస్తున్నాడు క్రిష్ అని తెలుస్తోంది. కంచె కమర్షియల్ విజయం ఎలా వుంటుందో ఇప్పుడే తెలియదు. కానీ సినిమాకు మంచి ప్రశంసలు రావడం క్రిష్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచింది. కంచె సినిమాకు శాటిలైట్ ఇంకా కాలేదు.
సినిమాకు వచ్చిన పాజిటివ్ బజ్ ఇప్పుడు మంచి రేటు రాబట్టే అవకాశం వుంది. ఇంతకు ముందు అయిదు ఆరు కోట్ల మధ్య ఊగిసలాడింది. ఇప్పుడు ఆరు దగ్గరో, కాస్త అటుగానో ఫిక్సయిపోవచ్చు. అంటే నిర్మాణం ఖర్చులో ఇరవై అయిదుశాతం దాంతో రాబట్టుకున్నట్లే.
ఇదిలా వుంటే రామోజీరావుతో కలిసి క్రిష్ రెండు చిన్న సినిమాలు కూడా ప్లాన్ చేస్తున్నారు.
Film Desk
« PREV
NEXT »

No comments

Post a Comment