తాజా వార్తలు

Saturday, 3 October 2015

తుపాకుల మోతలేని తెలంగాణ మా లక్ష్యం- కేటీఆర్

తుపాకులమోతలేని రాష్ట్రాన్ని చూడటమే తమలక్ష్యమని మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు. గతంలో కేసీఆర్‌ చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నామని... ఆదిశగా తాము ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. తెలంగాణలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వంపై ప్రతిపక్షాలన్ని పసలేని ఆరోపణలు చేస్తున్నాయని మంత్రి చెప్పారు. ఉనికి కోసమే జెండాను పక్కనబెట్టి ఒక్కటయ్యారని విమర్శించారు. అధికారం కోల్పోయేసరికి అసహనం ఎక్కువైందన్నారు. అసెంబ్లీలో రైతు ఆత్మహత్యలపై చర్చ జరిగితే.. చిన్న సూచన కూడా చేయకపోవడం దారుణమన్నారు. ఐఎఎస్ ల విభజనకు ఇంత సమయం తీసుకున్న కేంద్రం తెలంగాణకు చేసిందేమీలేదని విమర్శించారు.ఈమేరకు వరంగల్ మీడియాతో ఆయన మాట్లాడారు. 
« PREV
NEXT »

No comments

Post a Comment