తాజా వార్తలు

Tuesday, 27 October 2015

తెలంగాణ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు మీద మంత్రి తారకరామారావు సమీక్షతెలంగాణ ప్రజలకు సురక్షిత తాగునీరు అందించాలన్న లక్ష్యంతో చేపట్టిన వాటర్ ప్రాజెక్టు పనులు వేగంగా సాగుతున్నాయని పంచాయితీరాజ్ మరియు ఐటిశాఖ మంత్రి తారకరామారావు చెప్పారు.. ప్రాజెక్టు తొలి ఫలాలను ప్రజలకు త్వరలోనే అందించబోతున్నట్టు తెలిపారు..మొత్తం 24500 జనావాసాలకు నీరు అందించాలన్న లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో రాబోయే ఆరు నెలల్లోనే మూడు వేల జనావాసాలకు తాగునీరు అందిస్తామన్నారు.. వచ్చే ఏప్రిల్ 30 నాటికి గజ్వేల్ నియోజకవర్గానికి తెలంగాణ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టుతో నీళ్లు ఇస్తామని, ఆ తర్వాత మేడ్చల్ తో పాటు నల్లగొండ, రంగారెడ్డి ,ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాల్లోని పలు ప్రాంతాలకు నల్లాతో నీళ్లు అందిస్తామని స్పష్టం చేశారు..దేశంలోని ఇతర రాష్ట్రాలు తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టు వైపు చూస్తున్నాయని.. యూపి లాంటి పెద్ద రాష్ట్రాలు తమ దగ్గర చేపట్టబోయే ప్రాజెక్టులకు మనల్నే ఆదర్శంగా తీసుకుంటున్నాయని ఇంజనీర్లకు చెప్పారు..ఇలాంటి ప్రాజెక్టు పనులను మరింత వేగంగా పూర్తి చేసేందుకు పట్టుదలతో పనిచేయాలని జిల్లా ఎస్.ఈలకు సూచించారు.


తెలంగాణ డ్రింకింగ్ ప్రాజెక్టు జిల్లా ఎస్.ఈలు, ఈఈలతో హైదరాబాద్ లో మంత్రి తారకరామారావు సమీక్షా సమావేశం నిర్వహించారు..సెగ్మెంట్లు- మండల వారీగా ఏ ఏ తేదీనాటికి తాగునీరు ఇస్తామో ప్రజలకు తెలియచేయాలని ఎస్.ఈలకు సూచించారు..డెడ్ లైన్లు పెట్టుకుని పనిచేయాలని, ఎప్పటిలోగా పనులు పూర్తిచేస్తారో కచ్చితమైన తేదీలను తమకు నివేదిక రూపంలో ఇవ్వాలని ఆదేశించారు..ఆ నివేదికే ఎస్.ఈలకు బైబిల్, భగవద్గీత లాంటివన్నారు..జిల్లా స్థాయి సిబ్బందికి మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని..అందుకు సంబంధించి ప్రతిపాదనలు పంపాలన్నారు..సిబ్బంది కొరతను అధిగమించేందుకు అవుట్ సోర్సింగ్ విధానంలో నియామకాలు చేపట్టాలని, ఇందుకోసం జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకుని పనిచేయాలన్నారు.


జిల్లాల్లో జరుగుతున్న వాటర్ ప్రాజెక్టు పనుల గురించి ఆరా తీసిన మంత్రి..అటవీ అనుమతులు, భూసేకరణ పనులు ఎంత వరకు వచ్చాయో తెలుసుకున్నారు..ఇతర శాఖలతో సమన్వయం చేసుకునేందుకు ఏర్పాటు చేసిన జిల్లా జాయింట్ వర్కింగ్ గ్రూపుల సమావేశాలు ఎట్లా జరుగుతున్నాయో తెలుసుకున్నారు..డిజైన్ లను అప్రూవ్ చేసే అధికారాలను జిల్లా ఎస్.ఈలకే ఇస్తున్నట్టు చెప్పారు..ప్రధాన ప్రాజెక్టుపనులతో పాటు గ్రామాల అంతర్గత పైప్ లైన్ పనులను కూడా వేగంగా పూర్తి చేయాలన్నారు..హైదరాబాద్ కేంద్రంగా చేయాల్సిన డిజైన్లు,టెండర్ల పనులు పూర్తయిన నేపథ్యంలో క్షేత్ర స్థాయి పనులపై పూర్తి స్థాయి దృష్టి సారించాలని ఇంజనీర్లను ఆదేశించారు..ఈ సమావేశంలో పంచాయితీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రేమండ్ పీటర్, RWS ప్రభుత్వ సలహాదారు జ్ఞానేశ్వర్,RWS&S ఈ.ఎన్.సి బి.సురేందర్ రెడ్డి లతో పాటు ఆ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు...

News Desk
« PREV
NEXT »

No comments

Post a Comment