తాజా వార్తలు

Sunday, 11 October 2015

ప్రధానిపై లాలూ ఫైర్

బిహార్‌ తొలిదశ ఎన్నికల ప్రచారంలో వ్యక్తిగత దూషణల పర్వంతో సాగిపోతుంది. ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ మొదలుకొని.. సీఎం నితీశ్‌కుమార్‌, ఆర్జేడీ చీఫ్‌ లాలూ ప్రసాద్‌ యాదవ్‌ల వరకూ ప్రముఖ నేతలందరూ ఒకరిపై ఒకరు తిట్ల పురాణం అందుకున్నారు. ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్‌ల మహాకూటమి అధికారంలోకి వస్తే జంగిల్‌రాజ్‌(ఆటవిక రాజ్యం) వస్తుందని మోదీ పదేపదే విమర్శించగా.. గుజరాత్‌లో శాంతిభద్రతల సమస్య వల్ల స్థానిక సంస్థల ఎన్నికలు సైతం వాయిదా పడ్డాయని నితీశ్‌ శనివారం ఎద్దేవా చేశారు. బీజేపీ పాలిత రాషా్ట్రలైన మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, గుజరాత్‌, హరియాణాలలోనే నేరాల రేటు ఎక్కువగా ఉన్నట్లు జాతీయ నేర గణాంకాల సంస్థ వెల్లడించిందన్నారు. బిహార్‌లో అధికారంలోకి వచ్చాక గోవధను నిషేధిస్తామంటున్న బీజేపీ నేతలను చూసి నవ్వుకుంటున్నారని, రాష్ట్రంలో 1955 నుంచే గోవధపై నిషేధం ఉందన్నారు. ఇక హిందువులూ గోమాంసం తింటారంటూ లాలూ, రుషులూ బీఫ్‌ తినేవారంటూ ఆర్జేడీ మరో నేత రఘువంశ్‌ ప్రసాద్‌ వ్యాఖ్యానించి గగ్గోలు రేపగా.. లాలూ ఒక సైతాన్‌ అంటూ మోదీ విమర్శించారు. అయితే మోదీపై లాలూ శనివారం విలేకరుల సమావేశంలో ఘాటుగా స్పందించారు. ‘‘మోదీ ప్రమాదకర దెయ్యం.. బ్రహ్మ పిశాచి.. మంత్రాలతో అతడిని తరిమేయాలి.. అమిత్‌ షా నరభక్షకుడు. లాలూ సైతాన్‌ అని మోదీ అంటున్నారు. నేను యాదవుణ్ణి. వెనకబడిన తరగతి వాడిని కాబట్టే నన్ను సైతాన్‌ అని పిలుస్తున్నారు. నేను సైతాన్‌ అయితే నువ్వు(మోదీ) బ్రహ్మ పిశాచివి. ఒక ప్రధాని ఇలాంటి మాటలు వాడొచ్చా?’’ అని లాలూ ప్రశ్నించారు.
« PREV
NEXT »

No comments

Post a Comment