తాజా వార్తలు

Wednesday, 14 October 2015

కేటీఆర్ ,లారా - ఓ సెల్ఫీ ...!ఒకరేమో క్రికెట్ లెజెండ్.... ఇంకొకరమే తెలంగాణ రాష్ట్ర మంత్రి.. ఈ ఇద్దరూ బుధవారం కలుసుకున్నారు.... పొంతన లేని రంగాలకు చెందిన వీరిద్దరూ ఎందుకు కలిశారు.. ఎక్కడ కలిశారో తెలుసా... హైదరాబాద్ నగరంలోని హోటల్ తాజ్ కృష్ణలో విండీస్ మాజీ క్రికెటర్ బ్రియాన్ లారా తెలంగాణ మంత్రి కేటీఆర్ లు కలిశారు. ఆ సందర్భంగా కేటీఆర్ లారాతో ఓ సెల్ఫీ కూడా దిగారు.  తాజ్ కృష్ణలో యుప్ టీవీ ఆవిష్కరణ కార్యక్రమం జరగ్గా... దానికి మంత్రి కేటీఆర్ క్రికెటర్ బ్రియాన్ లారా - బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు. టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో భారతీయులు ఎప్పుడూ ముందుంటారన్నారు. హైదరాబాద్ నగరానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందని చెప్పారు. తెలంగాణను డిజిటల్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ప్రతి ఇంటికి ఇంటర్నెట్ సౌకర్యం కల్పించే దిశలో ముందుకు సాగుతున్నామని చెప్పారు. జలహారంతో పాటు బ్రాడ్ బాండ్ కనెక్టివిటీ అందించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. అనంతరం ఆయన లారాతో కాసేపు ముచ్చటించారు. స్వతాహాగా క్రికెట్ అభిమాని అయిన కేటీఆర్ లారాతో నవ్వుతూ మాట్లాడుతుండగా కెమెరాలు క్లిక్ మన్నాయి.

 కాగా లారా ఈ కార్యక్రమం తరువాత భారత క్రికెట్ గురించి మాట్లాడారు. మహేంద్ర సింగ్ ధోనీ అవసరం భారత్ కు ఇంకా ఉందని అన్నారు. అంతేకాదు 2016 ట్వంటీ 20 ప్రపంచ కప్ ను ఇండియా గెలుచుకోవడం ఖాయమని చెప్పారు. ధోనీపై వస్తున్న విమర్శలపై లారా ఆశ్చర్యం వ్యక్తంచేశారు. అన్ని ఫార్మాట్లలో ధోనీ అవసరం ఇంకా ఇండియాకు ఉందని... ధోనీని విమర్శించడం సరికాదని లారా అభిప్రాయపడ్డారు. ధోనీలో మంచి నాయకత్వ లక్షణాలున్నాయని కూడా ప్రైజ్ చేశారు
News Desk
« PREV
NEXT »

No comments

Post a Comment