తాజా వార్తలు

Friday, 30 October 2015

మధుప్రియ ప్రేమవివాహం సుఖాంతం

నాటకీయ పరిణామాల యువగాయిని మధుప్రియ వివాహం శుక్రవారం మధ్యాహ్నం వైభవంగా జరిగింది. ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్‌నగర్‌లోని వాసవీ గార్డెన్స్‌లో మధుప్రియ,శ్రీకాంత్ వివాహం జరిగింది. కెరీర్ మీద దృష్టి పెట్టాల్సిన వయసులో అప్పుడే పెళ్లి చేసుకోవడం సరికాదని మధుప్రియ తల్లిదండ్రులు అభ్యంతరం తెలిపినప్పటికీ ఆమె వినిపించుకోలేదు. ఆఖరికి తమ పెళ్లి రోజైన నవంబర్ 18న పెళ్లి చేస్తామని తల్లిదండ్రులు ప్రాధేయపడినా మధుప్రియ ఒప్పుకోలేదు. దీంతో ఆమె తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ నుంచి వెళ్లిపోయారు. ముందు నుంచి ఏర్పాటు చేసుకున్న ప్రకారమే  పెళ్లికొడుకు తల్లిదండ్రులు, బంధువుల సమక్షంలో వివాహం జరిగింది.  
« PREV
NEXT »

No comments

Post a Comment