తాజా వార్తలు

Tuesday, 20 October 2015

మహేష్ బాబు ని అవమానించిన చంద్రబాబు...?టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవమానించిందా అంటే అవుననే సమాధానం వస్తోంది . ఈనెల 22న విజయదశమి ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణ శంఖుస్థాపన కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా మంత్రుల బృందంతో పలువురు ప్రముఖులను ఆహ్వానించింది అలాగే చంద్రబాబు స్వయంగా వెళ్లి ప్రధాని మోడీ , తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ని ఆహ్వానించాడు . ఇక మంత్రుల బృందం చిరంజీవి ,పవన్ కళ్యాణ్ లను ఆహ్వానించింది కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు ని మాత్రం ఆహ్వానించడం మరిచి పోయారు కానీ ఆహ్వాన లిస్టు లో మాత్రం మహేష్ పేరుంది కానీ ఆయన్ని మంత్రుల బృందం ఆహ్వానించలేదు . అయితే  మహేష్ తన కుటుంబ సభ్యులతో పారిస్ వెళ్ళిపోయాడు దసరా సెలవులను ఎంజాయ్ చేయడానికి . అయితే మహేష్ ఫ్యాన్స్ మాత్రం ఆగ్రహంగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవహారం పట్ల .
News Desk
« PREV
NEXT »

1 comment

  1. If it is true, it is never an insult to him; rather, it is a pride for him;

    ReplyDelete