తాజా వార్తలు

Wednesday, 7 October 2015

సూటుకేసులో దొరికిపోయాడు

బట్టలు, వస్తువులు పెట్టుకెళ్లే సూట్‌కేస్‌లో ముడుచుకు పడుకొని దేశం నుంచి పారిపోవడం ఇప్పటి వరకు బహుశా చూసి ఉండరు! పెరు రాజధాని లిమాలో ఓ వ్యక్తి ఇలాగే ప్రయత్నించి అడ్డంగా అధికారుల చేతికి చిక్కాడు. జోర్జ్‌ చావెజ్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టుకు వచ్చిన ఓ వ్యక్తి టెన్షన్‌.. టెన్షన్‌గా వెళుతుండడం గమనించిన విమానాశ్రయ భద్రతాధికారులు.. అతడిని తనిఖీ చేసేందుకు ఆపారు. సూట్‌కేసు, అతడు వేసుకున్న బ్యాగును తెరవమన్నారు. కానీ, అతడు మాత్రం దానిని తెరవకుండా ఉండేందుకు ఎంతో ప్రాధేయపడ్డాడు. అయితే.. స్నిఫర్‌ డాగ్‌ ఆ ట్రాలీ సూట్‌కేస్‌వైపు తదేకంగా వాసన చూడడంతో.. అనుమానమొచ్చి అధికారులు దానిని తెరిచారు. ఇంకేముంది.. అందులో నుంచి ఓ నిలువెత్తు మనిషి ప్రత్యక్షమయ్యాడు. అవాక్కవడం అధికారుల వంతైంది. 
« PREV
NEXT »

No comments

Post a Comment