తాజా వార్తలు

Monday, 12 October 2015

జగన్‌ దీక్ష నేపథ్యంలో చంద్రబాబుకి ఫోన్‌ చేసి వార్నింగ్ ఇచ్చిన ప్రధాని....ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ నేతలు, ముఖ్యంగా ఏపీ మంత్రులు ప్రత్యేక హోదా కోసం నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్‌ జగన్‌ విషయంలో చేస్తున్న విమర్శల మాటెలా వున్నా, జాతీయ స్థాయిలో బీజేపీ నేతలు, జగన్‌ దీక్ష నేపథ్యంలో పరిస్థితుల్ని సునిశితంగా పరిశీలించే పనిలో బిజీగా వున్నారట. గడచిన నాలుగైదు రోజులుగా రోజువారీ రిపోర్ట్‌ తెప్పించుకుంటున్న బీజేపీ జాతీయ నాయకత్వం, 'నాలుగైదు రోజుల్లోనే దీక్ష సమసిపోతుందని అనుకున్నాం.. ఇప్పట్లో దీక్ష ఆగేలా లేదు.. ఇప్పుడేం చేద్దాం.?' అన్న ఆలోచనలో పడిపోయారట. 
ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా కల్పించుకుని, జగన్‌ దీక్షపై తనకు స్పష్టతతో కూడిన రిపోర్ట్‌ కావాలని పార్టీ శ్రేణులకు ఆదేశించినట్లు తెలుస్తోంది. అక్టోబర్‌ 22న ఆంధ్రప్రదేశ్‌కి రానున్న దరిమిలా, ఈలోపు జగన్‌ దీక్ష కారణంగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం వుందా.? అన్న కోణంలోనూ నరేంద్రమోడీ, ఏపీ బీజేపీ నేతల నుంచి రిపోర్ట్స్‌ తెప్పించుకుని, వాటిని విశ్లేషించే పనిలో పడ్డారు. 
ఇంకో పదిరోజుల్లోనే నరేంద్రమోడీ (అక్టోబర్‌ 22న) ఆంధ్రప్రదేశ్‌కి రానున్న విషయం విదితమే. అయితే నిన్నటినుంచీ వైఎస్‌ జగన్‌ ఆరోగ్య పరిస్థితి విషమిస్తూ వస్తోంది. జగన్‌ శరీరంలో కీటోన్‌ బాడీస్‌ లెవల్స్‌ పెరుగుతుండడంతో, పార్టీ శ్రేణుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. 'జగన్‌కి ఏమైనా జరిగితే పరిస్థితులు చెయ్యిదాటిపోతాయ్‌..' అంటూ పార్టీ శ్రేణులు అప్పుడే ఘాటైన హెచ్చరికలు పంపుతున్నారు ఇటు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికీ, అటు కేంద్ర ప్రభుత్వానికీ. 
'పరిస్థితి చెయ్యి దాటకుండా తగిన చర్యలు తీసుకోండి..' అంటూ ఇప్పటికే ప్రధాని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఫోన్‌ చేసి చెప్పారనే ప్రచారం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మాత్రం, 'పరిస్థితి విషమించింది..' అన్న భావన కలగగానే, దీక్షను భగ్నం చేసేందుకు తగిన రీతిలో వ్యూహాలు ఇప్పటికే సిద్ధం చేసుకున్నామనే ధీమాలో వుంది. 
మొత్తమ్మీద, వైఎస్‌ జగన్‌ దీక్ష విషయంలో నేడో రేపో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశముంది.
News Desk-AP
« PREV
NEXT »

No comments

Post a Comment