తాజా వార్తలు

Thursday, 8 October 2015

తల్లిపాలు - సంజీవని

తల్లిపాలు బిడ్డ సంపూర్ణ ఆరోగ్యానికి దివ్యౌషధం. ఆయురారోగ్యాలనిస్తుంది. సకల రోగాలను దూరం చేస్తుంది. పసిగుడ్డుగా ఉన్నప్పుడు తాగితే పండుముసలితనం వచ్చే వరకు కాపాడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మనిషిని కాపాడే సంజీవని- తల్లిపాలు. వీటిని మించిన పోషక పదార్థం లేదు. రోగ నిరోధకశక్తిని పెంచడంలో తల్లిపాలకు సాటి ఇంకేదీ లేదు.  తెలివితేటలు పెంచడమే కాదు.. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షణనిచ్చే దివ్యౌషధం తల్లిపాలు..స్పాట్బిడ్డ పుట్టిన గంటలోపు పిల్లలకు పాలిస్తే బిడ్డను భవిష్యత్తులో అనారోగ్యం నుంచి కాపాడినట్లే. ప్రసవం అయిన మూడు రోజుల వరకు వచ్చే ముర్రుపాలలో విటమిన్స్‌, మినరల్స్‌ తో పాటు వ్యాధి వ్యాధినిరోధకశక్తిని పెంచే గుణం ఉంటుంది. సాధారణంగా వచ్చే జలుబు, దగ్గు, నీళ్ల విరేచనాలను తట్టుకునే శక్తి పిల్లలకు తల్లిపాలతోనే వస్తుంది. ఇక బిడ్డ వయసుకు తగ్గ బరువు, ఎదుగులకు అవసరమైన బీ కాంప్లెక్స్‌, ప్రోటీన్స్‌ తల్లిపాలలో సమృద్ధిగా ఉంటాయి. బిడ్డ మెదడు వికాసానికి తోడ్పడతాయి. తల్లి పాలలోని లాక్టోజ్‌ వల్ల శరీరంలో కాల్షియం నిల్వలు పెరిగి ఎముకలు ధృడంగా తయారవుతాయి. రక్తహీనత, పోషకాహార లోపం నుంచి తల్లిపాలు కాపాడుతాయి. తొలి నెలలో శిశువులకు వివిధ రకాల అంటువ్యాధుల నుంచి కాపాడడంతో పాటు బిడ్డ మనోవికాసానికి, జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేసేందుకు తల్లిపాలు ఎంతో దోహదం చేస్తాయి. బిడ్డ పుట్టిన 30 నిమిషాల నుంచి గంటలోపు చాలా ఉత్సాహంగా ఉంటారు. ఈ సమయంలోనే ముర్రుపాలు పట్టడం వల్ల ఎన్నో లాభాలుంటాయి. ముర్రుపాలలోని మాంసకృత్తులు, విటమిన్‌ ఏ బిడ్డకు జీవితాంతం రక్షణ కవచంగా నిలుస్తాయి. శిశివు పేగులను శుభ్రం చేసి, మొదటి మల విసర్జన సజావుగా సాగేందుకు తోడ్పడతాయి. బాల్యంలోనే కాదు భవిష్యత్తులోనూ ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరకుండాచేసేవే తల్లి పాలు.
« PREV
NEXT »

No comments

Post a Comment