తాజా వార్తలు

Sunday, 11 October 2015

తొలిసారి గొంతువిప్పుతున్న నయనతార

నయనతార ఎంట్రీలోనే కాదు రీఎంట్రీలోనూ తనదే హవా అంటూ యమ క్రేజ్ సంపాదించుకుంది . ప్రస్తుతం స్టార్ హీరోల నుంచి యువ హీరోల వరకూ నయనతారనే హీరోయిన్‌గా కోరుకుంటున్నారంటూ తన స్టార్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఇక అసలు విషయం ఏమిటంటే దశాబ్దం పాటు పలు భాషల్లో పలు చిత్రాలు చేసినా ఏ భాషలోనూ ఏ ఒక్క భాషలోనూ ఇప్పటి వరకూ నయనతార తన చిత్రాలకు డబ్బింగ్ చెప్పలేదన్నది గమనార్హం. ఆమెతో డబ్బింగ్ చెప్పించడానికి దర్శక నిర్మాతలు ప్రయత్నించారో లేదో, లేక తను నిరాకరించిందో తెలియదు. దీపానే నయనతారకు డబ్బింగ్ చెప్పుతున్నరు. అలాంటి నయనతార తొలిసారిగా నానుమ్ రౌడీదాన్ చిత్రానికి డబ్బింగ్ చెప్పడం విశేషం.ఈ చిత్ర దర్శకుడు విఘ్నేశ్‌శివతో నయనతార ప్రేమాయణం అంటూ ఇప్పటికే ప్రచారం హల్‌చల్ చేస్తున్న విషయం విదతమే. తన చిత్రానికి డబ్బింగ్ చెప్పినందుకు దర్శకుడు విఘ్నేశ్ శివ థ్యాంక్స్ చెబుతూ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.  
« PREV
NEXT »

No comments

Post a Comment