తాజా వార్తలు

Tuesday, 6 October 2015

శాసనమండలి డిప్యూటీ చైర్మెన్‌గా నేతి విద్యాసాగర్‌ రావు

రాష్ట్ర శాసనమండలి డిప్యూటీ చైర్మెన్‌గా నేతి విద్యాసాగర్‌ రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పెద్దల సభకు డిప్యూటీ చైర్మెన్‌గా ఎన్నికైన ఆయనకు సీఎం కేసీఆర్‌, మంత్రులు అభినందలు తెలిపారు. డిప్యూటీ చైర్మన్‌గా నేతి విద్యాసాగర్‌ రావు ఎన్నికతో శాసన మండలికే గౌరవం పెరిగిందని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఏకగ్రీవంగా ఎన్నకున్నందుకు అన్ని రాజకీయ పార్టీలకు కృతజ్ఞతలు తెలిపారు. శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికైన నేతి విద్యాసాగర్‌కు సీఎం కేసీఆర్ అభినందనలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ కొత్తలో మండలిని ఎంతో చాకచక్యంగా సభను నడిపారన్నారు. నేటి తరం నాయకత్వానికి కావాల్సింది చిల్లరమల్లర రాజకీయాలు కాదన్నారు. నేతి విద్యాసాగర్ రావు మండలికి డిప్యూటీ చైర్మన్ గా ఎన్నుకోవడం కౌన్సిల్ కే గౌరవమన్నారు సీఎం కేసీఆర్.
« PREV
NEXT »

No comments

Post a Comment