తాజా వార్తలు

Thursday, 8 October 2015

మెగాహీరోయిన్ తొలి సినిమా గ్రాండ్ ఓపెనింగ్ ఈనెల 30 ...మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న తొలి హీరోయిన్ నీహారిక కొణిదెల. ఆమె నటిస్తున్న తొలి సినిమా ఓపెనింగ్ ఈనెల 30 వుంటుందట. ఈ మేరకు ఈ సాయంత్రం డిసైడ్ చేసారు.
ఓపెనింగ్ ఓ లెవెల్ లో వుండాలని ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం హైటెక్స్ ను వేదికగా డిసైడ్ చేసారు. చిరంజీవితో సహా దాదాపు మెగా ఫ్యామిలీ సభ్యులంతా హాజరు అవుతారని వినికిడి.
తండ్రి నాగబాబు,సోదరుడు వరుణ్ ఎలాగూ వస్తారు. అరవింద్, బన్నీ, చరణ్ కూడా రావడానికి ఓకె చెప్పారని తెలుస్తోంది పవన్ సంగతి మాత్రం తెలియదు.
సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం పంచుకుంటున్న టీవీ9 లైవ్ కవరేజీచేస్తుంది. నాగశౌర్య హీరొగా నటిస్తున్న ఈ సినిమాకు రామరాజు దర్శకుడు. మధుర శ్రీధర్ నిర్మాత.
Film Desk
« PREV
NEXT »

No comments

Post a Comment