తాజా వార్తలు

Monday, 5 October 2015

పరిటాల వర్గం వసూళ్ల పర్వం ఆగలేదా...!ఏమన్నా అంటే. మాకేం సంబంధం లేదు, మా కుటుంబం పేరుతో జరిగే దందాలకూ మాకూ సంబంధం లేదని అంటారు. అయితే ఒకవైపు అనంతపురం జిల్లాలో పరిటాల ఫ్యామిలీ పేరుతో దందాలు కొనసాగుతున్నాయి. వసూళ్ల పర్వం కొనసాగుతోంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ఒకటీ రెండు రోజుల్లోనే ఆ హడావుడి మొదలైంది. వ్యాపారస్తులను, ప్రముఖులను, డాక్టర్లను లక్ష్యంగా చేసుకొని.. బాగా సంపాదిస్తున్నారు కాబట్టి  మాకు డబ్బులివ్వాలనే బెదిరింపులు మొదలుపెట్టారు.
అదేమంటే... పరిటాల వర్గం, శ్రీరామ్ పేరు చెప్పుకొచ్చారు. అలాంటి నేపథ్యంలో... కొన్ని వ్యవహారాలు వార్తల్లోకి వచ్చాయి. పరిటాల పేరుతో తమను బెదిరిస్తున్నారని కొంతమంది పోలీసులకు కూడా ఫిర్యాదుల చేశారు. ఆ వ్యవహారాల రచ్చ అనంతపురం జిల్లాలో ఇంకా కొనసాగుతూనే ఉంది. 
మరి ఆ సంగతిలా ఉంటే..కేవలం ఇలాంటి దందాలే కాదు... ఏపీలోని అన్ని జిల్లాల్లోనూ ఇప్పుడు మరో రకమైన దందా నడుస్తోందని సమాచారం. ఈ దందా కూడా పరిటాల పేరుతో జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. మంత్రిగా ఉన్న పరిటాల సునీత పేరు చెప్పి గోడౌన్ల నుంచి కమిషన్లు వసూలు చేస్తున్నట్టా తెలుస్తోంది. సివిల్ సస్లై శాఖకు సంబంధించిన అవినీతి ఇది. మంత్రి పరిటాల సునీత ఆ శాఖ చూస్తున్న సంగతి తెలిసిందే.
ఆమె పేషీలోని ఒక ముఖ్య వ్యక్తి ఈ దందాలకు పాల్పడుతున్నాడని.. భారీగా కమషన్లను వసూలు చేస్తున్నాడని తెలుస్తోంది. ఈ వ్యవహారం సివిల్ సప్లై శాఖ అధికారుల మధ్య చర్చనీయాంశంగా మారింది. అసలే ఆ శాఖ అవినీతికి కొలువు. అడుగడుగునా అవినీతే ఉంటే రెవన్యూ, పోలీసు, ఎక్సైజ్ శాఖల తర్వాత సివిల్ సప్లై శాఖ వంతు ఉంటుంది. ఇప్పుడు ఆ శాఖలో కొంతమంది వ్యక్తులు ఇన్ వాల్వ్ మెంట్ తో అవినీతి మరీ తీవ్రస్థాయికి చేరిందని తెలుస్తోంది. అయితే ఈ విషయంపై మంత్రిగారు ఉలుకూ పలుకూ లేకుండా ఉన్నారు.
మరి మంత్రిగారికి తెలియకుండానే ఇలాంటి వసూళ్లు సాగుతూ ఉంటే... సివిల్ సప్లై శాఖలో ఇలాంటి వ్యవహారాలు జరుగుతుంటే...మంత్రిగారు ఎందు మౌనంగా ఉంటారు? ఆమె ప్రోద్బలంతోనే ఇలాంటి అవినీతి జరుగుతోందని మీడియా ప్రతినిధులు అంటున్నారు. మరి అటు రాజకీయంగా.. ఇటు ప్రభుత్వ పరంగా... పరిటాల ఫ్యామిలీ రచ్చ రచ్చ చేస్తున్నట్టుగా ఉందే!

News Desk- AP
« PREV
NEXT »

No comments

Post a Comment