తాజా వార్తలు

Saturday, 3 October 2015

చంద్రబాబు చేసేవన్నీ అవినీతి కార్యక్రమాలే- పార్థసారథి

వైఎస్సార్సీపీ నేత పార్థసారథి చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు చేసేవన్నీ అవినీతి కార్యక్రమాలేనని పార్థసారథి దుయ్యబట్టారు. రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని పెంచడమే పనిగా చంద్రబాబు అవినీతిని పెంచి ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు.  రైతుల వద్ద నుంచి వేలాది ఎకరాల భూములు లాక్కొని చంద్రబాబు జేబులు నింపుకుంటున్నారని, సింగపూర్ వాళ్ల జేబులు నింపుతున్నారని  మండిపడ్డారు. చంద్రబాబుకు సింగపూర్ మీద అంత ప్రేమ ఎందుకో చెప్పాలన్నారు. మీరు ప్రకటించిన ఆస్తుల సంగతి సరే. మరి విదేశాల్లో ఉన్న ఆస్తుల సంగతేంటని ప్రశ్నించారు. దమ్ము ధైర్యముంటే సింగపూర్ లోని ఆస్తులు, లావాదేవీలపై చంద్రబాబు విచారణకు సిద్ధపడాలని పార్థసారథి సవాల్ విసిరారు. చంద్రబాబుకు సింగపూర్ లో హోటల్ ఉందన్న విషయం దేశంలో అందరికీ తెలుసునన్నారు. ఇసుకమాఫియాను అంతమొందించాలంటూనే గుట్టలుగుట్టలుగా తోడేసి అమ్ముకుంటున్నారు. ఇల్లీగల్ కన్ స్ట్రక్షన్స్ కోసం కోట్లు కుమ్మరిస్తున్నారు.  
« PREV
NEXT »

No comments

Post a Comment