తాజా వార్తలు

Sunday, 18 October 2015

అన్నదమ్ముల అనుబంధం పొయింది అన్నారు? ఇప్పుడు ఎమంటారు...?
అసలే పవర్ స్టార్. దానికి తోడు స్టైల్ కు పర్యాయపదంగా వ్యవహరించే ఆయన.. తాజాగా  అన్నయ్య చిరంజీవి ఇంటికి రావటం తెలిసిందే. చిరంజీవిని కలిసేందుకు పవన్ కల్యాణ్ ఆయన ఇంటికి రానున్నారన్న సమాచారం అందిన వెంటనే.. మీడియాకు సమాచారం వచ్చేసింది. అంతే.. వీరిద్దరి కలయికను కవర్ చేసేందుకు కెమేరాలు పట్టుకొని బిలబిలా వచ్చేశారు.

కెమేరామెన్లు.. రిపోర్టర్లు చిరంజీవి ఇంటి ముందు భారీగా వచ్చేశారు. పవన్ రాక కోసం కాసేపు ఎదురుచూశారు. అనుకున్నట్లు పవన్ కారులో నుంచి దిగగానే కాస్తంత ఆశ్చర్యం. అంతలోనే సర్దుకున్నారు. ఎందుకంటే.. సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ నుంచి నేరుగా అన్నయ్య ఇంటికి తమ్ముడు వచ్చినట్లు ఆయన గెటప్ చూస్తే అర్థమవుతుంది. అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానించేందుకు ఏపీ మంత్రులు పవన్ దగ్గరకు వెళ్లినప్పుడు కూడా ఆయన సినిమా షూటింగ్ లో ఉన్నారు. అప్పుడు మంత్రులతోపాటు బయటకు వచ్చి మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఏ డ్రెస్ లో ఉన్నారో.. తాజాగా కూడా అదే కాస్ట్యూమ్లో ఉండటం గమనార్హం.

కాకపోతే.. మంత్రులు తనను కలవటానికి వచ్చినప్పుడు పెట్టుకున్న చొక్కా గుండీల కంటే కూడా మరికాసిన్ని గుండీలు వదిలేసి అన్నయ్య ఇంటికి వచ్చినట్లు అర్థమవుతుంది. అన్నయ్యను అభినంధించి.. వెంటనే షూటింగ్స్పాట్ కు వెళ్లాలని అనుకున్నారేమో కానీ.. కనీసం చొక్కా తీసేసి.. టీ షర్టు వేసుకోకుండానే.. షూటింగ్ స్పాట్ నుంచి నేరుగా వచ్చేసినట్లు కనిపించింది. 

చూస్తుంటే.. షూటింగ్ మధ్యలో ఉన్నప్పుడు అన్నయ్యను కలిసి అభినందిస్తే బాగుంటుందన్న ఆలోచన రావటంతో.. అలా బొకే పట్టుకొని అన్నయ్యకు సమాచారం ఇచ్చేసిన వచ్చినట్లుగా కనిపించింది. 
అన్నదమ్ముల అనుబంధం పొయింది అన్నారు? ఇప్పుడు ఎమంటారు...?........మెగా ఫ్యామిలి ఆల్వేస్ సూపర్ కదా...!!
Film Desk
« PREV
NEXT »

No comments

Post a Comment