తాజా వార్తలు

Saturday, 17 October 2015

పెప్సీ పి1 పేరుతో సెల్ ఫోన్ప్రపంచంలో సుపరిచితమైన కూల్ డ్రింక్ బ్రాండ్లలో ఒకటైన పెప్సీ కొత్త వ్యాపారంలోకి అడుగు పెట్టనుంది. ప్రపంచం మొత్తం మొబైల్ ఫోన్ల వైపు పరుగులు పెడుతున్న క్రమంలో ఇప్పటివరకూ తాను నిర్వహిస్తున్న వ్యాపారాలకు అదనంగా సెల్ ఫోన్ల వ్యాపారంలోకి అడుగు పెట్టాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.

ఇందుకు సంబంధించిన ప్లాన్ మొత్తం సిద్ధం చేయటంతో పాటు.. మోడళ్ల తయారీ కూడా మొదలైందని చెబుతున్నారు. రానున్న కొత్త రోజుల్లో తన పెప్సీ బ్రాండ్ తోనే ఈ కొత్త ఫోన్ ఉంటుందని చెబుతున్నారు. పెప్సీ పి1 పేరుతో మార్కెట్ లోకి వచ్చే సెల్ ఫోన్ తో మొబైల్ రంగంలో అరంగేట్రం చేస్తుందని చెబుతున్నారు.

5.5 అంగుళాల ఫుల్ హెచ్ డీ డిస్ ప్లే తో పాటు..అత్యాధునిక సాంకేతికతతో రానున్న ఈ ఫోన్ ధర రూపాయిల్లో రూ.13350గా చెబుతున్నారు. ఈ నెల 20న బీజింగ్ లో పెప్సీ ఫోన్ మార్కెట్ లోకి విడుదల చేయనున్నట్లు చెబుతున్నారు. చైనాకు చెందిన షింజెన్ టెక్నాలజీ సంస్థ పెప్సీ ఫోన్ ను రూపొందిస్తున్నట్లు చెబుతున్నారు. తొలుత చైనాలో మాత్రమే అమ్మేఈ ఫోన్ దశల వారీగా మిగిలిన దేశాల్లోకి తీసుకురానున్నట్లు చెబుతున్నారు.

పెప్సీ ఫీచర్లు చూస్తే..

= 5.5 అంగుళాల ఫుల్ హెచ్ డీ డిస్ ప్లే

= ఫింగర్ ప్రింట్ సెన్సార్

= మీడియా టెక్ ఆక్టో కోర్ ఎస్ ఓఎస్

= 2 జీబీ ర్యామ్

= 16 జీబీ ఇంటర్నల్ మెమరీ

= 13 ఎంపీ బ్యాక్ కెమేరా

= 5 ఎంపీ ఫ్రంట్ కెమేరా

= అండ్రాయిడ్ 5.1 వెర్షన్
National Desk
« PREV
NEXT »

No comments

Post a Comment