తాజా వార్తలు

Monday, 5 October 2015

ప్రభాస్ ,అనుష్కల పెళ్లి కుదిరిందా...?బాహుబలి 2షూటింగ్ కంప్లీట్ చేసాక ప్రభాస్ ,అనుష్క లు పెళ్లి చేసుకోనున్నారట ! ప్రభాస్ - అనుష్క పెళ్లి అనగానే ఇద్దరూ కలిసి పెళ్లి చేసుకోవడం కాదు ఇద్దరూ కూడా వేరు వేరుగా పెళ్ళిళ్ళు చేసుకోనున్నారు . గతకొంత కాలంగా ప్రభాస్ పెళ్లి వార్తలు వినబడుతూనే ఉన్నాయి ,ఇక అనుష్క సైతం 30ప్లస్ సుందరి కాబట్టి ఆమె పెళ్ళికి కూడా ఇంట్లోవాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు . అయితే ఈ ఇద్దరూ కూడా బాహుబలి చిత్రం ఒప్పుకోవడంతో వీలుకాలేదు . ఇక అనుష్క ఒకవైపు బాహుబలి ,మరోవైపు రుద్రమదేవి చిత్రాల్లో చేస్తుండటం వల్ల పెళ్లి వాయిదా పడుతూనే ఉంది . మొత్తానికి బాహుబలి2 షూటింగ్ కంప్లీట్ చేశాక అనుష్క పెళ్లి చేయడానికి ఇంట్లోవాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారట,ఓ బిజినెస్ మాన్ ని కూడా చూసారట ! అలాగే ప్రభాస్ కు కూడా పెళ్లి చేయడానికి పెద్దనాన్న కృష్ణంరాజు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు ఉభయ గోదావరి జిల్లా లకు సంబందించిన అమ్మాయిని ప్రభాస్ కోసం వెదుకుతున్నారట.

Film Desk
« PREV
NEXT »

No comments

Post a Comment