తాజా వార్తలు

Thursday, 15 October 2015

ప్రభాస్ నాలుగు రోజులు రకుల్ తో తర్వాత తాప్సీని లైన్ లో పెట్టాడు అంటా..?రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు మంచి జోరు మీదుంది. రేపు బ్రూస్ లీ విడుదల సందర్భంగా ఎడాపెడా ఇంటర్వ్యూ లిచ్చేస్తోంది. ప్రమోషన్ కార్యక్రమాల్లోనూ మహా ఉత్సాహం గా పాల్గొంటోంది. సాధారణం గా ఇలాంటి సందర్భాల్లో.. హీరోయిన్లు వారి గతాని కి సంబంధించిన మంచి విషయాలు మాత్రమే చెబుతుంటారు. కానీ పంజాబీ పిల్ల మహా గడుసుది. అందుకే తనకు గతంలో బాధ కలిగించిన విషయాలను కూడా పంచు కుంటోంది. ప్రేక్షకులకు తెలీని విషయాలను చెబుతోంది. 

ఓ నాలుగు రోజుల పాటు రకుల్ - ప్రభాస్ కలిసి నటించారట. ఇద్దరిపై కలిసి సీన్స్ కూడా చిత్రీకరించిన తర్వాత.. తన పాత్రకు వేరేవాళ్లను తీసుకున్నారని ఇన్ఫాం చేశారట. దీంతో అప్పట్లో బాగా హర్టయ్యానని చెబ్తోంద రకుల్. యాక్టింగ్ -  లుక్స్ - పెర్ఫా మెన్స్.. ఇలా ఏ విషయంలో నచ్చలేదో మాత్రం యూనిట్ వర్గాలు చెప్పలేదట. రకుల్ చెప్పక పోయినా అసలు విషయం మాత్రం టాలీవుడ్ లో తెలిసిపోయింది. దశరధ్ డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా మిస్టర్ పర్ఫెక్ట్ ని నిర్మించాడు దిల్ రాజు. ఈ మూవీలో సెకండ్ హీరోయిన్ పాత్ర కోసం మొదట రకుల్ ప్రీత్ సింగ్ నే తీసుకున్నారట. అయితే.. నాలుగు రోజుల షూటింగ్ తర్వాత అసంతృప్తి చెందిన యూనిట్ హీరోయిన్ ని మార్చాలనే నిర్ణయానికి వచ్చారట. 

ఇదే విషయాన్ని రకుల్ కి చెప్పేసి.. తాప్సీని లైన్ లో పెట్టారు. ఆ మూవీ మంచి సక్సెస్  నే సాధించింది. అలా అప్పట్లో అదృష్టం కలిసిరాక.. ఓ హిట్ మూవీ రకుల్ ఖాతాలోంచి జారిపోయింది. ఆ మూవీలో ఉండి ఉంటే.. స్టార్ హీరోలతో నటించి.. ఇప్పటికే స్టార్ స్టేటస్ ను సంపాదించేసుకునేది రకుల్. ఇప్పుడు తనకు స్టార్ లీగ్ లోకి తీసుకెళ్లే బాధ్యతను బ్రూస్ లీకి అప్పగించింది రకుల్. 
Film Desk.
« PREV
NEXT »

No comments

Post a Comment