తాజా వార్తలు

Thursday, 8 October 2015

ప్రియాంకా చోప్రా పేరు సెర్చ్ చేస్తే అంతే..

 ప్రియాంకా చోప్రా అనే పేరుతో ఇంటర్ నెట్ లో సెర్చ్ చేస్తే.. అత్యంత ప్రమాదకరమైన వెబ్ సైట్ల లింకులు వస్తున్నాయి. పొరపాటున వాటిని ఓపెన్ చేశారో, ఇక మీ కంప్యూటర్ వాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతుంది. మీ ఈమెయిల్ ఐడీ పాస్ వర్డుల దగ్గర్నుంచి ఇంటర్ నెట్ బ్యాంకింగ్ పాస్ వర్డుల వరకు అన్నీ వాళ్లకు అర నిమిషంలో తెలిసిపోయే అవకాశం ఉంటుంది. ఈ జాబితాలో ఇంకా చాలామంది ప్రముఖులే ఉన్నారు. శ్రద్ధా కపూర్, కపిల్ శర్మ.. ఇలాంటి వాళ్ల పేర్లతో కూడా ఇంటర్ నెట్ మోసగాళ్లు చెలరేగిపోతున్నారు. టీవీ షో ప్రీమియర్లు, అవార్డు షోలు, సినిమా ఆడియో విడుదల, సెలబ్రిటీల బ్రేకప్ లు.. ఇలాంటి విషయాల ఆధారంగా సైబర్ నేరగాళ్లు తమ చేతివాటం చూపిస్తున్నారు. టోరెంట్, హెచ్ డీ డౌన్ లోడ్, ఫ్రీ ఎంపీ4 లాంటి పదాలను ఈ సెలబ్రిటీల పేర్లకు జతచేసి.. నిజంగా అందులో ఏవైనా డౌన్ లోడ్లు ఉన్నాయేమోనని భ్రమపడేలా చేసి ఆకర్షించడం, ఆపై వాటిలో ప్రమాదకరమైన లింకులు పెట్టడం వీళ్లకు అలవాటుగా మారింది. ఇంతకుముందు కూడా జాక్వెలిన్ ఫెర్నాండెజ్, కంగనా రనౌత్, హృతిక్ రోషన్, దీపికా పడుకొన్, ఇమ్రాన్ హష్మి, సన్నీ లియోన్, ఆలియాభట్, ఆమిర్ ఖాన్, కరీనా కపూర్ లాంటి సెలబ్రిటీల పేర్లతో ప్రమాదకరమైన లింకులు పెట్టిన ఘటనలున్నాయి. ప్రియాంక పేరును సెర్స్ చేసినప్పుడు కాస్తా జాగ్రత్త...
« PREV
NEXT »

No comments

Post a Comment