తాజా వార్తలు

Saturday, 3 October 2015

హిందూ, ముస్లిం ఐక్యతకు రాజకీయ విద్వేషాలతో ముప్పు-రాహూల్ గాంధీ

ఉత్తర ప్రదేశ్ లోని దాద్రిలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటించారు. కొందరు గ్రామస్తుల మూకుమ్మడి దాడిలో చనిపోయిన మహ్మద్ ఇఖ్లఖ్ కుటుంబాన్ని పరామర్శించారు. ఇఖ్లఖ్ కుటుంబానికి తాము అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ఈ ఘటన దురదృష్టకరమన్నారు. గ్రామంలో శాంతి భద్రతలు నెలకొల్పేందుకు పోలీసులు కృషి చేయాలని రాహుల్ సూచించారు.
పశుమాంసం తిన్నాడని ఇఖ్లఖ్ కుటుంబంపై కొందరు గ్రామస్తులు దాడి చేశారు. వారిని ఇంట్లో నుంచి లాక్కొచ్చి ఇటుకలు, రాళ్లతో కొట్టారు. ఈ దాడిలో ఇఖ్లఖ్ చనిపోయాడు. అతని కొడుకు తీవ్రంగా గాయపడ్డాడు. దశాబ్దాలుగా కొనసాగుతున్న హిందూ ముస్లిం ఐక్యతకు రాజకీయ విద్వేషాలతో ముప్పు తెచ్చారని ఆ తర్వాత రాహుల్ ట్వీట్ చేశారు. 
« PREV
NEXT »

No comments

Post a Comment