Writen by
vaartha visheshalu
00:40
-
0
Comments
రకుల్‌ప్రీత్‌సింగ్ తెలుగులో అగ్ర కథానాయకుల సరసన నటిస్తూ బిజీగా మారిపోయింది. ఆమె నటించిన బ్రూస్లీ చిత్రం ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రామ్‌చరణ్ కథానాయకుడిగా శ్రీను వైట్ల రూపొందిస్తున్న ఈ చిత్ర ప్రారంభం రోజునే చిత్ర వర్గాలు విడుదల తేదీని ప్రకటించడంతో హీరో రామ్‌చరణ్ ఈ సినిమా కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇటీవల ఈ సినిమాలోని ఓ పాట కోసం రామ్‌చరణ్ ఏకధాటిగా 17 గంటలు పనిచేసి ఆశ్చర్యపరిస్తే చిత్ర కథానాయిక రకుల్‌ప్రీత్ సింగ్ 24 గంటలు ఏకధాటిగా పనిచేసి ఆయన్ని మించిపోయింది. రకుల్ మాట్లాడుతూ బ్రూస్లీ సినిమా చిత్రీకరణ పూర్తయింది. సినిమాను అనుకున్న సమయానికి అందించాలని ప్రతి ఒక్కరం శ్రమించాం. చిత్రంలోని చివరి పాటను పూర్తిచేయడం కోసం నేను 24 గంటలు పనిచేయాల్ని వచ్చింది. ఇంత మంచి టీమ్‌తో పనిచేచే అవకాశం దక్కినందుకు ఆనందంగా వుంది అని తెలిపింది.
No comments
Post a Comment