తాజా వార్తలు

Tuesday, 13 October 2015

నిహారిక హీరోయిన్...?-రాంచరణ్

సినీ తార హీరోయిన్ గా కొణిదెల నీహారిక తళుక్కుమనడానికి వస్తున్న విషయం అందరికి తెలిసిందే. కాగా ఈ విషయం తన అన్న రామ్ చరణ్ కు మాత్రం తెలియదట. ఈ విషయాన్ని పేపర్ లో చదివే తెలుసుకొన్నాడట. నీహారిక హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తానంటే నాకు ఎందుకు ప్రాబ్లెమ్... ఉంటే బాబాయ్ కు ఉండాలిగానీ అని వ్యాఖ్యానించాడని సమాచారం. మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న తొలి హీరోయిన్ ఎంట్రీకి గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారట. మెగా ఫ్యామిలీ మొత్తం ఈ కార్యక్రమానికి హాజరై.. నీహారికను ఆశ్వీరదించనున్నారట. 'ఒక మనసు' తో నాగ శౌర్యకు జోడీగా తెలుగు తెరపై అడుగు పెట్టడానికి నీహారిక ఈ నెలాఖరున రెడీ అవుతుంది. మెగా ఫ్యామిలీలో కొత్త శకానికి నాంది పలకబోతున్న నీహారికను అందరికీ పరిచయం చేయడం కోసం మెగాస్టార్ చిరుతో సహా మెగా హీరోలందరూ.. మరియు ఇతర హీరోలు కూడా హాజరవుతారని ఇండస్ట్రీలో గుసగుసలు వినబడుతున్నాయి.
« PREV
NEXT »

No comments

Post a Comment