తాజా వార్తలు

Wednesday, 28 October 2015

సొంత డబ్బుతో అంతా చేస్తున్నా.....రాయపాటి



సొంత డబ్బుతో అంతా చేస్తున్నా.. మార్పు రాకుంటే రాజీనామా చేస్తా: రాయపాటి
తన నియోజక వర్గంపై ప్రభుత్వాధికారులు చిన్న చూపు చూస్తున్నారని.. ఈ పరిస్థితి కొనసాగితే తాను రాజీనామా చేస్తానని గుంటూరు జిల్లా నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గ పరిధిలో తాగునీటి సమస్య ఇబ్బంది పెడుతోందని.. అధికారులు స్పందించకపోవడంతో తన సొంత డబ్బుతో ట్యాంకర్లను ఏర్పాటు చేయించానని రాయపాటి అన్నారు.
తన నియోజన వర్గ సమస్యల పరిష్కారంపై అధికారులు ఏమాత్రం స్పందించట్లేదని రాయపాటి ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాదిన్నరగా ఇదే పరిస్థితి నెలకొందని, ఇకపైనా ఇలాగే జరిగితే తన ఎంపీ పదవికి రాజీనామా చేసేస్తానని ఆయన హెచ్చరించారు.
గుంటూరులో వివిధ సంక్షేమ పథకాలపై జిల్లా ఉన్నతాధికారులతో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సమీక్షించారు. ఈ సమావేశానికి హాజరైన రాయపాటి అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన ప్రత్తిపాటి మంత్రికి సర్దిచెప్పడమే కాకుండా.. అధికారులపై మండిపడ్డారు. అలాగే ఎంపీ పేర్కొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు.

News Desk
« PREV
NEXT »

No comments

Post a Comment