తాజా వార్తలు

Friday, 2 October 2015

రాయల్ మంత్రులు ఇకపై వియ్యంకులు....!


ఇప్పటివరకూ కోలీగ్స్ గా ఉన్న ఇద్దరు ఏపీ మంత్రులు ఇకపై వియ్యంకులు కానున్నారు. ఇద్దరు ప్రముఖ నేతల మధ్య పెళ్లి సంబంధం కుదిరింది. ఏపీ మంత్రులు గంటా శ్రీనివాసరావు.. నారాయణ రెండు కుటుంబాలు వియ్యం అందుకోనున్నాయి.

మంత్రి నారాయణ రెండో కుమార్తె శరణిని.. గంటా శ్రీనివాసరావు కుమారుడు రవితేజకు ఇచ్చి ఈ నెల 30న వివాహం చేయనున్నారు. నెల్లూరులో జరిగే ఈ వివాహ వేడుకను భారీగా చేపట్టాలని భావిస్తున్నారు. ఇప్పటివరకూ జరగని రీతిలో అత్యంత వైభవంగా పెళ్లి వేడుకల్ని నిర్వహించాలని నారాయణ కుటుంబం భావిస్తోన్నట్లు తెలుస్తోంది.

పెళ్లి వేడుక పూర్తి అయిన నాలుగు రోజులు తర్వాత అంటే.. నవంబరు 4న విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీలో మంత్రి గంటా శ్రీనివాసరావు భారీ రిసెప్షన్ ను ఇవ్వనున్నారు. ఇద్దరు బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాలు  వియ్యమెందటం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

News Desk-AP
« PREV
NEXT »

No comments

Post a Comment