తాజా వార్తలు

Thursday, 8 October 2015

రుద్రమదేవి రివ్యూ

రుద్రమదేవి బాక్స్ ఆఫీస్ ను కొల్లగొట్టడం ఖాయంగా కనిపిస్తుంది.  కాకతీయ వంశ రాజు గణపతి దేవ రాజు (కృష్ణం రాజు) రాజ్యం మీద దాడి చెయ్యడానికి సిద్దం గా ఉంటారు దేవగిరి రాజులు అంతే కాకుండా సామంత  రాజులు కూడా సింహాసనం దక్కించుకోడానికి చూస్తుంటారు. గణపతి దేవరాజు కి కొడుకు జన్మిస్తే వీటన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది అని ఆ రాజ్య ప్రజలు నమ్ముతుంటారు కాగా గణపతి దేవా రాజు కి కూతురు పుడుతుంది. మహా మంత్రి అయిన శివ దేవయ్య(ప్రకాష్ రాజ్) సలహా మేరకు పుట్టింది ఆడపిల్ల కాదని మాగాపిల్ల్లాడే అని  నమ్మిస్తారు పేరు "రుద్రదేవ(అనుష్క)" అని పెడతారు. యుద్ద రంగంలో శిక్షణ పొందుతూ ఆరితేరిన రుద్రదేవునికి ఇద్దరు స్నేహితులు ఉంటారు. చాళుక్య వీరభద్రుడు(దగ్గుబాటి రానా) మరియు గోన గన్న రెడ్డి(అల్లు అర్జున్) ఇదే సమయంలో యుద్దానికి సిద్దం అవుతుంటాడు దేవగిరి రాజు మహాదేవ నాయకుడు ఆలోచిస్తుంటాడు. తండ్రి మరణంతో సామంత రాజుల మీద  కక్ష కట్టిన గోన గన్న రెడ్డి ఒక్కోకరిని చంపుతూ వస్తుంటాడు ఎప్పటికి అయిన రుద్రదేవుని చావు తన చేతిలోనే అని ప్రతిన చేస్తాడు.. ఇదిలా సాగుతుండగా రుద్రదేవునికి ముక్తంబ(నిత్య మీనన్) ఇచ్చి పెళ్లి చేస్తారు. ఒకరోజు నదిలో స్నానం చేస్తున్న రుద్రమదేవి ని చూసి మనసు పెడతాడు వీరభద్రుడు ఎలాగయినా రుద్రదేవుడిని ఒప్పించి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అని నిర్ణయించుకుంటాడు .. ప్రజలకు రుద్రదేవుడు రుద్రమదేవి అని ఎప్పుడు తెలిసింది? రుద్రమదేవి గోన గన్నా రెడ్డి ని ఎలా ఎదురుకుంది? రుద్రదేవుడే రుద్రమ దేవి తాను ప్రేమించిన అమ్మాయి అని తెలిసిన వీరభాడురుడు ఎం చేసాడు? అనే అంశాలు తెర మీద చూడవలసిందే.. 
ఈ చిత్రం మొత్తం అనుష్క పాత్ర చుట్టూ తిరుగుతుంది అనుష్క కూడా ఈ పాత్రకోసం చాలా కష్టపడ్డట్టు కనిపిస్తుంది అనుష్క ప్రయత్నంలో ఎటువంటి లోపం లేదు, పాత్రకు తగ్గ హావభావాలు , ధీరత్వం అద్భుతంగా పలికించారు. అల్లు అర్జున్ పోషించిన గోన గన్నా రెడ్డి పాత్ర ఈ చిత్రానికి హైలెట్ , అయన వేషధారణ మరియు యాస బాగా సెట్ అయ్యింది. ఆయనకి రాసుకున్న డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఈ చిత్రంలో ఈ పాత్ర కాస్త ఊరట ఇస్తుంది. ఏదిఏమైనా రుద్రమదేవి లాంటి ఓ హిస్టారికల్ సినిమాని తెరపైకి తీసుకురావడానికి సహకరించిన అనుష్క, అల్లు అర్జున్ లకు స్పెషల్ థాంక్స్ చెప్పాలి. రానా పాత్రకి అంత ప్రాముఖ్యత లేదు ఉన్నంతలో అతని నటన బాగుంది. ఈ పాత్రకు మరింత ప్రాముఖ్యత ఉంటె బాగుండేది. విక్రంజీత్ నటన పరవాలేదు, కేథరిన్ త్రెస నటనతోనే కాకుండా అందచందాలతో కూడా ఆకట్టుంది. ప్రకాష్ రాజ్ , సుమన్, కృష్ణం రాజు , కృష్ణ భార్గవ్ , హంస నందిని, వెన్నెల కిషోర్,బాబా సెహగల్, శివాజీ రాజ , ఉత్తేజ్ ఇలా పలువురు నటులు తెర మీద కనిపిస్తారు.  
« PREV
NEXT »

No comments

Post a Comment