తాజా వార్తలు

Monday, 5 October 2015

సర్దార్ గబ్బర్ సింగ్ లో పవర్ స్టార్ అంత్యాక్షరి....!!!గబ్బర్ సింగ్ సినిమాలో అంత్యాక్షరి సీన్ ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. ఆ సీన్ పుణ్యమా అని అందులో రౌడీ గ్యాంగ్ గా నటించిన వారు కాస్త ఆదాయం ఇప్పటికీ అందుకుంటున్నారు. ఇప్పుడు గబ్బర్ సింగ్ 2 ముస్తాబవుతోంది..సర్దార్ గబ్బర్ సింగ్ పేరిట.
ఈ సినిమాలో కూడా అంత్యాక్షరి టైపు ఎపిసోడ్ ఒకటి కాస్త డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ప్రీ క్లయిమాక్స్ సమయంలో వస్తుంది.
అయితే మొదటి భాగం మాదిరిగా కాకుండా కాస్త డిఫరెంట్ గా వుండాలని, పైగా ఈసారి పవర్ స్టార్ కూడా అంత్యాక్షరిలో పాదం కదుపుతారని వినికిడి. అంటే మొత్తానికి వినోదం ఓ రేంజ్ లో వుండేలా ప్లాన్ చేస్తున్నారన్నమాట.
Film Desk

« PREV
NEXT »

No comments

Post a Comment