తాజా వార్తలు

Sunday, 18 October 2015

శృంగారంతో కిడ్నీలో ఉత్పత్తి అయ్యే రాళ్ళకు చెక్‌ఆశ్చర్యంగా ఉన్నా శృంగారంతో కిడ్నీలో ఉత్పత్తి అయ్యే రాళ్ళకు చెక్‌ చెప్పడం సాధ్యమేనని పరిశోధనలు చెప్తున్నాయి కాబట్టి నమ్మాలి. కిడ్నీలో రాళ్ళు ఏర్పడకుండా ఉండటానికి వివిధ రకాల ఆహారపదార్థాలు ఉపయోగపడ్తాయి. వచ్చినవాటిని తొలగించుకోవడానికి శృంగారం దివ్యమైన ఔషధం అని పరిశోధకులు గుర్తించారు. 

6 మిల్లీమీటర్ల సైజున్న కిడ్నీ స్టోన్‌ శృంగార చర్యలతో తేలిగ్గానే మూత్రంద్వారా బయటకు వస్తుందట. వారంలో మూడు అంతకంటే ఎక్కువసార్లు శృంగారంలో పాల్గొంటే, అది మూత్ర మార్గాన్ని, ప్రోస్టేట్‌ మార్గాన్నీ వదులు చేస్తుందని, తద్వారా రాయి సులువుగా మూత్రంలోంచి బయటకు వస్తుందని పరిశోధనల్లో వెల్లడయ్యింది. 
పరిశోధన ఇలా జరిగింది 

మూడు గ్రూపులుగా కొంతమంది కిడ్నీ స్టోన్‌ బాధితుల్ని వేరు చేశారు. మొదటి గ్రూప్‌, వారంలో మూడుసార్లకన్నా ఎక్కువ శృంగారంలో పాల్గొనేలా చేశారు. ఇంకో గ్రూప్‌కి చెందిన బాధితులకి రాళ్ళను కరిగించే మందులు ఇచ్చారు. ఇంకొకరికి వేరే మార్గాల్లో రాళ్ళను కలిగించేలా ఏర్పాట్లు చేశారు. మొత్తం 75 మందిని ఈ పరిశోధన కోసం తీసుకున్నారు. మొదటి గ్రూప్‌కి చెందిన 31 మందిలో 26 మందికి కిడ్నీ స్టోన్స్‌ బయటకు వచ్చేశాయి. రెండో గ్రూప్‌లో 21 మందికిగాను కేవలం 10 మందికే రాళ్ళు బయటకు వచ్చాయట. మూడో గ్రూప్‌లో 23 మంది ఉండగా, 8 మంది మాత్రమే రాళ్ళను యూరిన్‌ ద్వారా బయటకు పంపగలిగారు. 
Bureau Desk
« PREV
NEXT »

No comments

Post a Comment