తాజా వార్తలు

Friday, 16 October 2015

షారూక్ ఖాన్ కు మరో డాక్టరేట్..

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ను బ్రిటన్ కు చెందిన ప్రఖ్యాత యూనివర్సిటీ ఎడిన్ బర్గ్ ఘనంగా సత్కరించింది. ఆయన చేస్తున్న మానవతా సేవలకు గుర్తింపుగా గౌరవ డిగ్రీని ప్రదానం చేసింది. అనంతరం వేదికపై తన పాపులర్ లుంగీ డ్యాన్స్ తో విద్యార్థులను అలరించాడు. షారూక్ ఖాన్  స్పందిస్తూ.. జీవితంలో 'సాధారణం' అంటూ ఏదీ లేదు. అదొక జీవం లేని పదం మాత్రమే. సంతోషకరమై, విజయవంతమైన జీవితాన్ని గడపాలంటే కొంత పిచ్చితనం (రొమాంటిక్ తరహాలో) కూడా అవసరమే. మీ వెర్రితనాన్ని ఎప్పుడు చంచలత్వంగా భావించకండి. బయటి ప్రపంచం నుంచి దాచిపెట్టకండి. ప్రపంచంలోని అందమైన వ్యక్తులు, సృజనకారులు, విప్లవాలు తీసుకొచ్చినవాళ్లు, ఆవిష్కరణలు చేసినవాళ్లు.. తమ నైజాన్ని, ప్రవృత్తిని స్వీకరించడం వల్లే వాటిని సాధించారు. గడబిడ కావడంలో తప్పేమీ లేదు. ప్రపంచం గురించిన స్పష్టత కావాలంటే గడబిడ పడటం కూడా ఒక మార్గమే. కళాకారుడి కన్నా కళే ముఖ్యం. మీదైన కళతో మీకు అనుబంధం లేకపోవడమే వెనుకబాటు.  ముందుకుసాగండి. మీరు సంపన్నులు కాకముందే తత్వవేత్తలు అవొద్దు. మీరు చేస్తున్న పని మీలో 'జోష్'ను నింపకపోతే దానిని మానేయండి.
« PREV
NEXT »

No comments

Post a Comment