తాజా వార్తలు

Saturday, 3 October 2015

శివ‌మ్ రివ్యూ

వీకెండ్ లో టైమ్ పాస్ కోసం ఒక్క‌సారి ఈ శివ‌మ్ ఓకే గానీ.. కొత్త‌ద‌నం కోరుకునే వాళ్ల‌కు మాత్రం శివ‌మ్ త‌ల‌నొప్పే. శివ‌మ్ లో కొత్త క‌థంటూ ఏమీ లేదు. గ‌త ప‌దేళ్లుగా ఇదే ఫార్ములాతో ఎన్నో సినిమాలు తెలుగు ఇండ‌స్ట్రీలో వ‌చ్చాయి. హీరోయిన్ ను చూసిన తొలి చూపులోనే హీరో ప్రేమ‌లో ప‌డ‌టం.. త‌ర్వాత ఆమె ప్రేమ కోసం ఏదైనా చేయ‌డం.. మ‌ధ్య‌లో వ‌చ్చిన విల‌న్స్ ను త‌న ప్రేమ‌లో బ‌క‌రాల‌ను చేసి ఆడుకోవ‌డం.. ఫ‌స్టాఫ్ మొత్తం హీరో కారెక్ట‌రైజేష‌న్.. హీరోయిన్ తో ల‌వ్ ట్రాక్.. కొన్ని కామెడీ సీన్లు.. విల‌న్ ల‌తో చిన్న గొడ‌వ‌లు.. ఇలాగే సాగిపోతుంది. కందిరీగ త‌ర్వాత స‌రైన విజ‌యం లేని రామ్.. ఒక్క స‌క్సెస్ అంటూ బాక్సాఫీస్ పైకి దండ‌యాత్ర చేస్తూనే ఉన్నాడు.  
క‌థ‌:
ప్రేమ కోసం ఏదైనా చేసే కుర్రాడు రామ్. ఎవ‌రైనా ల‌వ‌ర్స్ ప్ర‌మాదంలో ఉన్నారంటే త‌న ప్రాణాలు అడ్డేసి కాపాడేసే గ‌ట్స్ ఉన్న కుర్రాడు. అలాంటోడికి ఐ ల‌వ్ యూ అంటూ రాశీఖ‌న్నా ఎదురుప‌డుతుంది. హీరోయిన్ ను ఫాలో చేసే టైమ్ లోనే అనుకోకుండా వినీత్ కుమార్ కొడుకుల‌తో గొడ‌వ పెట్టుకుంటాడు శివ‌మ్. ఆల్రెడీ ఊరినిండా శ‌త్రువుల్ని పెంచుకున్న శివ‌మ్ కోసం మ‌రో విల‌న్ అభిమ‌న్యు సింగ్ కూడా తిరుగుతుంటాడు. ఇంత‌మంది విల‌న్స్ మ‌ధ్య త‌న ప్రేమ‌ను శివ‌మ్ ఎలా గెలిపించుకున్నాడు..? అస‌లు బోజిరెడ్డి కొడుకుల‌తో శివ‌మ్ ఎందుకు గొడ‌వ పెట్టుకున్నాడు..? అభితో శివ‌మ్ కు లింకేంటి.. ఇవ‌న్నీ వెండితెర‌పైనే చూడాలి.


« PREV
NEXT »

No comments

Post a Comment