తాజా వార్తలు

Monday, 12 October 2015

జగన్ దీక్ష సోషల్ మీడియాలో బంపర్ హిట్ -అడ్డుకొలేకపోయిన బాబు....?
ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ తో వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత  జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష ఆరంభం దగ్గర నుంచి భగ్నం వరకూ తెలుగు మీడియాకు పెద్దగా పట్టలేదు. అధికార పార్టీకి గులాంగా వ్యవహరించే మీడియా జగన్ దీక్ష గురించి మాట్లాడం, చూపించం.. అన్నట్టుగా వ్యవహరించింది. ఏపీ ప్రయోజనాలకు సంబంధించిన ఈ దీక్ష కన్నా ప్రధాన మీడియా వర్గాలకు బిహార్ ఎన్నికలు.. ఇతర అంశాలే ముఖ్యం అయిపోయాయి.

ఏపీకి ఏ మాత్రం సంబంధం లేని బిహార్ ఎన్నికల గురించి బీజేపీ అధ్యక్షుడి మాటలను అరపేజీపై స్థాయి నిడివిని కేటాయించి వినిపించే ప్రధాన పత్రికలు.. ఏపీలో వారం రోజుల పాటు ప్రతిపక్ష నేత నిరాహార దీక్ష చేస్తే ఏ మాత్రం పట్టలేదు. మరి విజ్ఞులైన ఆ పత్రిక పాఠకులు కూడా ఆ పత్రిక అజెండాకు అనుగుణంగా సర్దుకుంటే ఎవరికీ నష్టం లేదనుకోవచ్చు.
అయితే ప్రింట్ , ఎలక్ట్రానిక్ మీడియాకు జగన్ దీక్ష గురించి పట్టకపోయినా... సోషల్ మీడియాలో మాత్రం జగన్ మోహన్ రెడ్డి దీక్ష హిట్ అయ్యిందనే చెప్పాలి. ఏ మీడియాధినేత ప్రాపకం అవసరం లేదని... ఏ మీడియా వర్గం సపోర్ట్ అవసరం లేని సోషల్ మీడియాలో జగన్ దీక్ష ట్రెండింగ్ గా నిలిచింది. ఫేస్ బుక్ లో జగన్ దీక్ష ప్రముఖమైన చర్చనీయాంశంగా మారింది. ఎక్కవు హ్యాష్ ట్యాగ్ లతో, పోస్టులతో ట్రెండింగ్ సబ్జెక్టుల్లో ముందు నిలిచింది.
ఎటువంటి ట్యాంపరింగ్ కు అవకాశం లేదని ఈ ఫేస్ బుక్ ట్రెండ్స్ విషయంలో జగన్ ముందున్నాడు. ఉత్కంఠభరితంగా జరిగిన ఇండియా దక్షిణాఫ్రికా తొలి వన్డే..  ఎక్కువమందిలో ఆసక్తిని రేకెత్తిస్తున్న వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ విడుదల.. వంటి అంశాల కన్నా ఎక్కువగానే జగన్ దీక్ష గురించి సోషల్ మీడియాలో చర్చ జరిగింది. ట్రెండింగ్ జాబితాలో టాప్ లో నిలిచింది.

దీన్ని బట్టి మీడియాను అయితే మ్యానేజ్ చేయడం అధికార పార్టీలకు సులభమే కానీ... సోషల్ మీడియాను మ్యానేజ్ చేయడం కష్టం అనే విషయాన్ని వారు గుర్తించాలేమో! యువత ప్రధానంగా వినియోగించే సోషల్ మీడియాలో జగన్ దీక్షపై మంచి చర్చే జరిగిందని అర్థం చేసుకోవాలమే.
News Desk-AP
« PREV
NEXT »

No comments

Post a Comment