తాజా వార్తలు

Thursday, 8 October 2015

శ్రీనగర్ వీధుల్లో బీఫ్ మంటలు

శ్రీనగర్ వీధుల్లో బీఫ్ మంటలు భగ్గుమంటున్నాయి. రాష్ట్ర అసెంబ్లీ ప్రాంగణం ఆందోళనలతో అట్టుడికిపోతోంది. విందులో పశు మాంసాన్ని వడ్డించాడంటూ నిన్న రాష్ట్ర అసెంబ్లీలో రషీద్ ఇంజినీర్ అనే స్వతంత్ర సభ్యునిపై బీజేపీ సభ్యుడు దాడి చేసిన విషయం తెలిసిందే. దీనిని నిరసిస్తూ ఇవాళ అసెంబ్లీ ఆవరణలో రషీద్ ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యేకు మద్దతుగా ఆయన అనుచరులు ఆందోళనలో పాలు పంచుకున్నారు. పోలీసులు వారిని అక్కడ నుంచి వెళ్లిపోవాలని కోరిన సందర్భంగా పోలీసులకు, ఎమ్మెల్యే మద్దతుదారులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఎమ్మెల్యే రషీద్ మద్దతుదారులను పోలీసులు అరెస్టు చేశారు. అసెంబ్లీ ప్రాంగణంలో యుద్ధవాతావరణం తలపించింది.
« PREV
NEXT »

No comments

Post a Comment