తాజా వార్తలు

Monday, 12 October 2015

సుధీంద్రపై ఇంకు దాడి, ఖండించిన అద్వానీ

ముంబై అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ ఛైర్మన్ సుధీంద్ర కులకర్ణిపై ఇంకు దాడి జరిగింది. పాక్ మాజీ మంత్రి ఖుర్షీద్ మహ్మద్ కసూరి బుక్ లాంచింగ్ కార్యక్రమం నిర్వహణకు నిరసనగా.. శివసేన కార్యకర్తలు ఆయన ముఖంపై బ్లాక్ ఇంక్ చల్లారు. పాక్ మాజీ మంత్రి కసూరి రాసిన “నైదర్ ఏ హాక్, నార్ ఏ డోవ్: యాన్ ఇన్ సైడర్ అకౌంట్ ఆఫ్ పాకిస్తాన్ ఫారిన్ పాలసీ’’ పుస్తకం రిలీజ్ కార్యక్రమాన్ని సుధీంద్ర కులకర్ణి ఇవాళ ముంబైలో నిర్వహించనున్నారు. ఐతే ఈ కార్యక్రమాన్ని తీవ్రంగా నిరసిస్తున్న శివసేన కార్యకర్తలు.. ప్రోగ్రాం ప్రారంభానికి కొన్ని గంటల ముందు సుధీంద్రపై ఇంక్ దాడికి పాల్పడ్డారు. సుధీంద్ర కులకర్ణిపై ఇంకు దాడి ఘటనను బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే. అద్వానీ తప్పుపట్టారు. కులకర్ణిపై ఇంకు దాడిని తాను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. ఇలాంటి ఘటనలు దేశానికి చెడ్డ పేరు తీసుకొస్తాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రతిఒక్కరూ పరస్పర గౌరవ భావంతో మెలగాల్సిన అవసరం ఉందన్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment