తాజా వార్తలు

Tuesday, 13 October 2015

కులకర్ణి 100 మంది కసబ్ లకు సమానం-సామ్నాలో సంపాదకీయం

సుధీంద్ర కులకర్ణిపై శివసేన దాడిని కొనసాగిస్తున్నది. తాజాగా సుధీంద్ర కులకర్ణిని ముంబై దాడుల ఉగ్రవాది అజ్మల్ కసబ్ తో పోల్చింది. 'కులకర్ణిలాంటి వాళ్లు ఇక్కడే ఉన్నప్పుడు పాకిస్థాన్ కు కసబ్ లాంటి వాళ్లను పంపాల్సిన అవసరమే ఉండదు. 100 మంది కసబ్ లకు సమానమైన నష్టాన్ని కులకర్ణి చేయగలరు' అంటూ శివసేన అధికార పత్రిక 'సామ్నా' తన సంపాదకీయంలో విరుచుకుపడింది. పాకిస్థాన్ విదేశాంగమంత్రి ఖుర్షీద్ మహ్మద్ కసూరి రాసిన పుస్తకావిష్కరణకు నిర్వాహకుడిగా ఉన్న సుధీంద్ర కులకర్ణిపై సోమవారం నల్లరంగు పోసి శివసేన నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ముంబైలో కసూరి పుస్తకావిష్కరణను రద్దు చేయాలన్న తమ డిమాండ్ కు నిరాకరించడంతో శివసేన ఈ చర్యకు ఒడిగట్టింది. మరోవైపు కసూరి రాసిన 'నైదర్ ఏ హాక్ నర్ ఏ డోవ్: ఆన్ ఇన్ సైడర్స్ అకౌంట్ ఆఫ్ పాకిస్థాన్ ఫారెన్ పాలసీ' పుస్తక ఆవిష్కరణ ముంబైలో జరిగింది.  
« PREV
NEXT »

No comments

Post a Comment