తాజా వార్తలు

Tuesday, 13 October 2015

సిరియాలో రష్యన్ ఎంబసీపై దాడి

అంతర్గత యుద్ధంతో సిరియా సతమతమౌతున్న విషయం తెలిసిందే. సిరియాలో రష్యన్ రాయబార కార్యాలయంపై తిరుగుబాటుదారులు రాకెట్లతో దాడి చేశారు. తిరుగుబాటుదారులు ప్రభుత్వంపై తిరుగుబాటును ప్రకటించి మారణకాండను సృష్టిస్తూ ఒక్కొక్క ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు. గడిచిన రెండు వారాలక్రితం నుంచి సిరియా వ్యవహారాల్లో రష్యా ప్రవేశించింది. గగనతల దాడులను చేస్తూ తిరుగుబాటుదారులను హతమారుస్తుంది. రష్యా ప్రభుత్వ చర్యను హర్షిస్తూ స్థానిక పౌరులు కృతజ్ఞతలు తెలిపేందుకు దాదాపు 300 మంది ఆదేశ ఎంబసీ వద్ద గూమిగుడారు. ఈ సమయంలో తిరుగుబాటుదారులు రాకెట్ల దాడికి పాల్పడ్డారు. ఒక్కసారిగా పొగలు కమ్ముకోవడంతో ప్రజలు చెల్లచెదురైపోయారు. 
« PREV
NEXT »

No comments

Post a Comment