తాజా వార్తలు

Friday, 16 October 2015

అక్టోబర్ 19న ఎస్ బీహెచ్ ముందు టీడీపీ ధర్నా

రైతులకు రుణాలు ఇవ్వనందుకు నిరసనగా ఈనెల 19న ఎస్‌బీహెచ్‌ ప్రధాన బ్రాంచ్‌ ఎదుట ధర్నా చేపడుతామని ప్రభుత్వాన్ని టీటీడీపీ హెచ్చరించారు. తెలంగాణలో సీఎం కేసీఆర్‌ నిర్లక్ష్యం వల్లే 1600 మంది రైతుల ఆత్మహత్యలు చేసుకున్నారని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ ఆరోపించారు. శుక్రవారం ఆయన ఢీల్లీలో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవాలని కేంద్ర మంత్రులను కోరామని తెలిపారు. మంత్రులు హరీష్‌, కేటీఆర్‌ శాఖలకు వేలాది కోట్లు కేటాయిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎంపీ కవిత బతుకమ్మకు కోట్లాది రూపాయలు కేటాయించిన ప్రభుత్వం, రైతులను ఆదుకోవడానికి ముందుకు రావడం లేదని రమణ విమర్శించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, రావుల చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment