తాజా వార్తలు

Saturday, 17 October 2015

మొబైల్ యూజర్లకు శుభవార్త

ఫోన్  కాల్ అంతరాయాలతో ఇబ్బంది పడుతున్న మొబైల్ యూజర్స్ కు శుభవార్త.  మొబైల్ వినియోగదారు ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు మాటల మధ్యలో కాల్ కట్ అయితే… టెలికాం సంస్థలు ప్రతి అంతరాయానికి రూపాయి చొప్పున పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఐతే ఒకరోజులో మూడు అంతరాయాలకు మాత్రమే పరిహారాన్ని పరిమితం చేసింది. అంటే మూడు కన్నా ఎక్కువసార్లు కాల్ డిస్ కనెక్ట్ ఐనా మూడుసార్లకు మాత్రమే పరిహారం లభిస్తుంది. టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్.. టెలికాం సంస్థలకు తాజా ఆదేశాలు జారీ చేసింది.  ట్రాయ్ తాజా నిబంధన ప్రకారం… కాల్ చేసిన వ్యక్తికి మాత్రమే పరిహారం పొందే హక్కు ఉంటుంది. అటు కాల్ చేసిన వ్యక్తి, అందుకున్న వ్యక్తి ఒకే నెట్ వర్క్ పరిధికి చెందినవారు ఐనప్పుడు మాత్రమే పరిహారం అందుతుంది. ఇదిలావుంటే ప్రీ పెయిడ్ యూజర్స్ కు కాల్ అంతరాయం ఏర్పడిన నాలుగు గంటల లోపే… అందుకు పరిహారం చెల్లిస్తున్నట్లుగా టెలికాం సంస్థలు ఎస్సెమ్మెస్ పంపాలని ట్రాయ్ ఆదేశించింది. పోస్ట్ పెయిడ్ యూజర్స్ కైతే తర్వాత నెల బిల్లులో పరిహారం వివరాలను తెలియజేయాలని ఆర్డర్ వేసింది. కాగా ట్రాయ్ తాజా ఆదేశాలపై సెల్యులార్ ఆపరేటర్ల సంఘం కోయ్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ట్రాయ్ ఆదేశాలు తమను తీవ్రంగా నిరాశపరిచాయంది. కాల్ డిస్ కనెక్ట్ సమస్యకు పరిహారం సరైన పరిష్కారం కాదన్న కోయ్… దానివల్ల మరింత సందిగ్ధత తలెత్తే అవకాశం ఉందని అభిప్రాయపడింది. రోజులో సగం మంది మొబైల్ యూజర్స్ కు కాల్ అంతరాయం ఏర్పడినా… తాము 150 కోట్ల రూపాయల పరిహారం చెల్లించాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. ట్రాయ్ ఆదేశాలు లైసెన్స్ రూల్స్ విరుద్ధమన్న కోయ్… దానిపై ఆ సంస్థనే సంప్రదిస్తామని తెలిపింది. అవసరమైతే అప్పిలేట్ ట్రిబ్యునల్ ను ఆశ్రయిస్తామని స్పష్టంచేసింది.
« PREV
NEXT »

No comments

Post a Comment