తాజా వార్తలు

Saturday, 10 October 2015

ప్రశాంతంగా తెలంగాణ బంద్

రైతుల ఆత్మహత్యలపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా విపక్షాలు చేపట్టిన బంద్‌ కొనసాగుతోంది. డిపోల నుంచి బస్సులు బయటకు రాకుండా పలు పార్టీల నాయకులు అడ్డుకున్నారు. రంగారెడ్డి జిల్లా తాండూరు బస్‌ డిపో ఎదుట విపక్షాలు ఆందోళనకు దిగాయి. మెదక్‌ జిల్లా రామచంద్రాపురం దగ్గర టీడీపీ, కాంగ్రెస్‌, బీజేపీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు. హైదరాబాద్‌ ఎంజీబీఎస్‌ ఎదుట విపక్షాలు ఆందోళన నిర్వహించాయి. కాంగ్రెస్‌ నాయకులు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి దానం నాగేందర్‌, అంజన్‌కుమార్‌ యాదవ్‌ తదితరులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. దిల్‌సుఖ్‌నగర్‌ బస్టాండ్‌ ఎదుట కాంగ్రెస్‌ నేతలు ఆందోళన చేశారు. మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి సహా పలువురు కాంగ్రెస్‌ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. రాణిగంజ్‌ బస్‌డిపో ఎదుట కాంగ్రెస్‌, బీజేపీ కార్యర్తలు ఆందోళన చేశారు. ఆందోళన చేసినందుకు మల్లు భట్టి, శశిధర్‌రెడ్డిని అరెస్ట్‌ చేసి నాంపల్లి పీఎస్‌కు తరలించారు. మరోవైపు జీడిమెట్ల బస్‌ డిపో ఎదుట టీడీపీ ఆందోళన కార్యక్రమం చేశారు. రాజేంద్రనగర్‌ బస్‌ డిపో ఎదుట ప్రకాశ్‌గౌడ్‌, సబితా ఇంద్రారెడ్డిలు బైఠాయించారు. బంద్ సందర్భంగా జూబ్లీ బస్టాండ్‌ దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. బస్సులను టీడీపీ నేతలు రేవంత్‌రెడ్డి, మాగంటి గోపీనాథ్‌ అడ్డుకున్నారు. పోలీసులు వీరిని అదుపులోకి తీసుకోపోగా రేవంత్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రేవంత్‌, మాగంటి గోపీనాథ్‌లను అరెస్ట్‌ చేసి బొల్లారం పీఎస్‌కు తరలించారు.
« PREV
NEXT »

No comments

Post a Comment