తాజా వార్తలు

Friday, 16 October 2015

స్వీడన్ లో కన్యత్వ పరీక్షల గుట్టురట్టు

స్వీడన్ లో గత కొంతకాలంగా డాక్టర్లు అనుమానాస్పద కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు. తమకు ఇష్టం లేకపోయినా వైద్యులు కన్యత్వ పరీక్షలు నిర్వర్తిస్తున్నారని యువతులు ఆరోపణలు చేస్తుండటంతో ఈ మేరకు ఓ మీడియా సంస్థ కోవర్టు ఆపరేషన్ నిర్వహించారు. రహస్యంగా నిర్వహించిన ఆపరేషన్ లో స్వీడన్ వైద్యులు ఏ విధంగా ఈ కార్యక్రమాలకు పాల్పడుతున్నారో బయటపడింది. 
వివరాల్లోకి వెళితే.. స్వీడన్ కు చెందిన కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ కల్లా కఫ్తా సంస్థ రహస్యంగా ఈ ఆపరేషన్ నిర్వహించింది. ముందుగా కొన్ని ఆస్పత్రులకు వెళ్లిన అండర్ కవర్ జర్నలిస్టులు ఆయా ఆస్పత్రులలో సీసీ కెమెరాలు అమర్చారు. అనంతరం ఓ మహిళా జర్నలిస్టు ఓ 17 ఏళ్ల బాలికను తీసుకెళ్లి కన్యత్వ పరీక్షలు చేసి సర్టిఫికెట్ ఇవ్వాలని వైద్యులను కోరింది. కానీ, ఆ బాలిక నిరాకరిస్తుండగానే వైద్యులు పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమవుతూ కెమెరా కళ్లకు చిక్కారు. కన్యత్వ పరీక్షలు, అది కూడా ఇష్టం లేకుండా వైద్యులు చేసే కన్యత్వ పరీక్షలు చేయడం స్వీడన్ చట్టం గట్టిగా వ్యతిరేకిస్తుంది. అయినా, ఆ చట్టాన్ని లెక్కచేయకుండా వయోభేదం లేకుండా బాలికలకు కూడా వైద్యులు కన్యత్వ పరీక్షలు ఇప్పటికే నిర్వహించినట్లు వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.  
« PREV
NEXT »

No comments

Post a Comment