తాజా వార్తలు

Thursday, 8 October 2015

విష్ణు "డైనమైట్" పేలలేదా....?హిట్ లు ఫ్లాపులు వుంటాయి..డబ్బులు వస్తాయి..పోతాయి..సినిమా రంగంలో ఇది ఎవరికైనా అనుభవమే. కానీ ఒక్కోసారి ఆడతుంది..కన్ఫర్మ్ గా జనం ఆదరిస్తారు అనుకున్న సినిమా రివర్స్ అయితే భలే షాకింగ్ గా వుంటుంది. హీరో మంచువిష్ణుకు డైనమైట్ సినిమా ఇలాంటి అనుభవాన్నే మిగిల్చిందట.
సినిమా తమిళంలో సాధించిన విజయం, జోనర్, డైరక్టర్ కు వున్న పేరు, ఖర్చుకు రాజీపడకుండా ప్రచారం కోసం చేసిన ఖర్చు, వెరసి ఇవన్నీ చిత్రంపై విష్ణుకు నమ్మకాన్ని విపరీతంగా పెంచాయట. కానీ సినిమా డిజాస్టర్ అయిన తీరు చూసి షాక్ కలిగిందట.
ముఖ్యంగా ఓపెనింగ్స్ ఊహించిన విధంగా లేకపోవడం, ఆశ్చర్యం కలిగించిందట. అన్ని ఈక్వేషన్ల ప్రకారం కనీసం ఓపెనింగ్స్ వండాలి కదా..అవెందుకు లేవన్నది ఆ ఆశ్చర్యానికి కారణంగా. అలాగే ఈ జోనర్, డైరక్టర్ ప్రకారం ఓవర్ సీస్ లో జనం సినిమాను కాస్తయినా ఆదరించాలి. అక్కడ మరీ ఘోరంగా విఫలమైంది. దీంతో విష్ణుకు డైనమైట్ దాదాపు పూర్తిగా షాక్ ఇచ్చిందని వినికిడి.

Film Desk
« PREV
NEXT »

No comments

Post a Comment