తాజా వార్తలు

Wednesday, 28 October 2015

వరంగల్‌ ఎంపీ రేసు అంటే బయపడుతున్న తెదేపావరంగల్‌ ఎంపీ బరిలో ఎన్డీయే అభ్యర్థి బరిలో ఉంటాడని మాత్రమే ప్రస్తుతానికి అధికారిక ప్రకటన. తెదేపా భాజపాల్లో ఏ పార్టీకి చెందిన వారు అభ్యర్థి అయినా సరే.. అందరూ కలిసి విజయం కోసం పనిచేస్తాం అని కూడా ఏదో జనాంతికంగా తెదేపా నేతలు సెలవిచ్చారు. అయితే అమిత్‌ షా వద్దకు వెళ్లి.. ఆయనకు నచ్చజెప్పి.. వరంగల్‌లో తాము విజయం సాధించే అవకాశం ఎక్కువని ఆయనకు వివరించి.. తెదేపాకే సీటు దక్కేలాగా మంత్రాంగం నడపాలనేది తెతెదేపా నాయకుల ఆలోచన మాత్రమే. ఇది చంద్రబాబు ప్రోత్సాహంతో జరుగుతున్న ప్రయత్నం కాదు. చంద్రబాబు భాజపాకు వదిలేద్దాం అన్నప్పటికీ ఆయనకే నచ్చజెప్పి.. తెతెదేపా నేతలే భుజానికెత్తుకున్న బాధ్యత ఇది. 
అయితే ఇప్పుడు పార్టీలో ఒక కొత్త ట్విస్టు చోటు చేసుకుంటోంది. సీటును తెదేపాకే ఇచ్చేయడానికి ఒకవేళ అమిత్‌షా అంగీకరించినా కూడా.. అక్కడ పోటీకి అనుమతి ఇవ్వవద్దని, అసలు వీలైతే అమిత్‌షా వరకు వెళ్లకుండానే.. సీటును భాజపాకు ఇచ్చేసేలా తెతెదేపాను ఆదేశించాలని కోరుతూ.. చంద్రబాబునాయుడుకు ప్రీతిపాత్రులైన పార్టీ కోటరీ ఆయనమీద ఒత్తిడి తెస్తున్నట్లుగా ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. భాజపా మొత్తం అంగీకరించినా కూడా ఆసీటులో పోటీకి మాత్రం ఒప్పుకోవద్దని చంద్రబాబును ప్రభావితం చేయగల బడా నేతలు కొందరు ఆయనతో మంత్రాంగం నడిపిస్తున్నారట. 
అయితే వారి ఆలోచన మాత్రం వేరు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వరంగల్‌లో తమ పార్టీ విజయం సాధించడం అనేది చాలా కష్టం. ఒకవేళ గెలిచినా కూడా.. ఏదో పార్టీ గెలిచిందని సంతృప్తి పడాలే తప్ప.. బావుకునేది పెద్దగా ఏమీ ఉండదు. అయితే.. పార్టీ తరఫున అభ్యర్థిని పెడితే.. ఎంపీస్థానానికి ఆర్థికంగా పూర్తి ఖర్చులు సొంతంగా పెట్టుకోగల స్థాయి వ్యక్తి.. తమ పార్టీ దళితనేతల్లో లేరు కదా అనేది వారి సందేహం. ఒకసారి బరిలోకి దిగిన తర్వాత.. ఆర్థిక వనరులను సమకూర్చే భారం తమ మీద పడుతుందని.. కోట్ల రూపాయలను సర్దుబాటు చేయాల్సి వస్తుందని వారు వెనుకాడుతున్నారుట. ఎన్నికోట్లు సర్దుబాటు చేసినా.. పార్టీ గెలిచినా, ఓడినా తమకు దక్కేది మాత్రం ఏమీ ఉండదని.. ఆ భాగ్యానికి భారం ఎందుకనే ఉద్దేశంతో అసలు సీటు వదిలేసుకుందాం అని చంద్రబాబు మీద ఒత్తిడి తెస్తున్నారట. ఒక నిర్ణయం వెనుక ఎన్ని రకాల వ్యూహాలు ఉంటాయో కదా.. అనిపిస్తోంది.. ఈ వైనం వింటోంటే....!
News Desk
« PREV
NEXT »

No comments

Post a Comment