తాజా వార్తలు

Sunday, 11 October 2015

జగన్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరం

ప్రతిపక్ష నాయకుడు,వైఎస్సార్సీపీ అధ్యక్షుడు  వైఎస్ జగన్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారింది. నేడు ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. దీక్ష కొనసాగిస్తే ఆరోగ్యం విషమించే  ప్రమాదముందని వైద్యులు చెబుతున్నారు. వైఎస్ జగన్ ఆరోగ్యంపై కుటుంబసభ్యులతో పాటు, పార్టీనేతలు, కార్యకర్తలు, అభిమానులు సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారంతా ఆందోళన చెందుతున్నారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రి వైద్యులు ప్రతి నాలుగు గంటలకోసారి వైఎస్ జగన్ కు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ జగన్ బరువు తగ్గడంతో బాగా నీరసించిపోయారని వైద్యులు తెలిపారు. శరీరంలో షుగర్ లెవల్స్ భారీగా పడిపోయాయని, కీటోన్ లెవల్స్ పెరుగుతున్నాయని చెప్పారు. గంటగంటకు పల్స్ రేటు పడిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ దీక్ష ఐదవరోజుకు చేరుకున్న సందర్భంగా ఉదయం 7 గంటలకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ...11 గంటలకు మరోసారి పరీక్షలు చేశారు. ఆరోగ్యం క్షీణించినా  హోదా వచ్చే వరకు దీక్ష కొనసాగుతుందని వైఎస్ జగన్ స్పష్టం చేస్తున్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment