తాజా వార్తలు

Monday, 5 October 2015

YS ముఖ్యమంత్రిగా చెసిన పనులే బాబు శంఖుస్థాపన చేస్తాడా...వినేవాడు....... అయితే చెప్పేవాడు....అనీ ఒక బూతు సామెత వుంది. అది చంద్ర బాబుకి, బాబు చెప్పే మాటలు నమ్మి ఆనంద పారవశ్యంలో మునిగిపోయే జనాలకు చక్కగా సరిపోతుంది.
1). పోల్లవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని YS ముఖ్యమంత్రిగా వుండాగానే ప్రారంభించి అత్యంత వేగంగా పనులు చేస్తూ......
పోలవరం నుండి కృష్ణ నది వరకు మాజీ ముఖ్య మంత్రి వై యస్ రాజశేఖర రెడ్డి cm గా ఉన్నప్పుడే కాలువను తవ్వేశారు.
కానీ అదే కాలువకు జనరేటర్లు బిగించి హడావిడిగా నాసిరకం పనులు చేసి వేల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడి నేనే నదుల అనుసంధానం చేసానని చెప్పుకోవడం ఘోరం.... నేరం.

2).తోటపల్లి రిజర్వాయర్ కు బాబు శంఖుస్థాపన రాయి వేస్తే ....... YS హయాములో దానిని పూర్తి చేసి దానికి సర్దార్ గౌతు లచ్చన్న పేరు పెట్టాడు.
ఇప్పుడు బాబు దానిని జాతికి అంకితమిస్తున్నట్లు బిల్డ్అప్ ఇస్తూ ...... సర్దార్ గౌతు లచ్చన్న పేరు తానే పెట్టినట్లు ప్రకటించుకున్నాడు.
3)పులిచింతల ప్రాజెక్ట్ YS హయాములో ప్రారంభమయ్యి కిరణ్ కుమార్ రెడ్డి హయాములో పూర్తి అయ్యింది.
4)పోతిరెడ్డి పాడు, హంద్రి నీవా, గుండ్లకమ్మ లాంటి ఎన్నో ప్రాజెక్టులు కాంగ్రెస్ హయాములోనే కట్టబడ్డాయి.
5) తెలంగాణాలో దేవాదుల లాంటి ప్రాజెక్టు బాబు శంకుస్థాపన చెయ్యగా చాలావరకు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసింది.
6) నాగార్జున సాగర్ డ్యాం, శ్రీశైలం డ్యాం లాంటి ఎన్నో ప్రాజెక్టులు కాంగ్రెస్ హయాములోనే కట్టబడ్డాయి.
మరి ఈ అబద్దాల బాబు.... ఇతరులు, ఇతర పార్టీలు చేసిన పనులను తానే చేసినట్టు నిస్సిగ్గుగా అబద్దాలాడుతూ ప్రజలను వంచిస్తుంటే.... ప్రజలు నమ్మడం ఎంత ఘోరం?
తెలుగుదేశం హయాములో ఏ ఒక్క ప్రాజెక్టు కట్టలేదు. ఒక హైదరాబాద్ లో మాజీ ప్రధాని PV నరసింహారావు ప్రపంచీకరణకు ద్వారాలు తెరుస్తూ సంతకం చెయ్యడంతో హైదరాబాద్లోని వాతావరణ పరిస్థితులకు కొన్ని కంపెనీలు వచ్చాయి. అదొక్కటే బాబు హయాములో జరిగిన అభివృద్ధి.
HITECH సిటీ పేరుతో చుట్టు ప్రక్కల భూములను సొంత కులం వారితో కారు చవుకగా ముందే కొనిపించేసి ఆ తర్వాత అక్కడ HITECH సిటీ కడుతున్నట్టు ప్రకటించి లక్షలకోట్ల రూపాయల కుల దోపిడీకి పాల్పడి ప్రపంచ అగ్రగామి అవినీతి పరుడిగా ముద్రపడిన బాబు ఆంధ్ర ప్రజలను ఎలా ఏమర్చుతున్నాడో చూస్తుంటే కడుపు తరుక్కుపోతోంది.
ఇప్పుడు రాజధాని నిర్మాణం పేరుతో సొంత కులానికి దోచి పెడుతూ కుల రాజధానిని నిర్మిస్తున్నాడు. పోర్టుల పేరుతో మత్స్య కారుల నోట్లో మట్టి కొడుతూ, ఆ ప్రాంతాలలోని మత్స్యకార, గౌడ, కాపు, దళిత సామాజిక వర్గాల భూములను బలవంతంగా గుంజుకుని వారిని అక్కడి నుండి వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ కుల దోపిడీకి, విచ్చలవిడి అవినీతికి అంతు లేకుండా పోతున్నా జనాలు ఎదిరించే ధైర్యం చేస్తే పోలీసు కేసులకు, లాటీ దెబ్బలకు లేదా ఆత్మ హత్యల రూపంలో ప్రభుత్వ హత్యలకు గురికావలసిందే......!

Editorial Special Desk 
« PREV
NEXT »

No comments

Post a Comment