తాజా వార్తలు

Thursday, 8 October 2015

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రొటీన్ కు భిన్నంగా సెల్పీ ట్రై చేస్తుందా...!గుడ్డెద్దు చేల్లో పడ్డట్టుగా కాకుండా... ప్రజా పోరాటాలు అంటే అవి ప్రజలతో పెద్దగా సంబంధం లేకుండా సాగిపోయేవి అని కాకుండా... వాటిల్లో వీలైనంత ఎక్కువమందిని ఇన్ వాల్వ్ చేయాలనే విషయం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడిప్పుడే అర్థం అవుతున్నట్టుంది.  రాజకీయం అంటే ఎంత సేపూ అధినేత సెంట్రిక్ గా జరిగేది కాదు... వైఎస్ ఇమేజ్ తోనే నడిచిపోయేది కాదు.. అనే విషయాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ వాళ్లు గ్రహించారనే అనుకోవాల్సి వస్తోంది.
వైకాపా రాజకీయాలు వైఎస్సార్ సమాధి పరిధిని చాటి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. విశాఖలోనూ, తిరుపతిలోనూ నిర్వహించిన యువభేరీలు వైకాపా కు కొత్త గుర్తింపును తీసుకొస్తున్నాయి. అంతే కాదు.. ఇప్పుడు జగన్ దీక్షల విషయంలో కూడా కవరేజీ "సాక్షి'' పరిధి దాటింది. జగన్ దీక్ష చేయడం.. దానికి సాక్షిలో ఒక పేజీ కవర్ చేయడం వంటి మొక్కుబడి వ్యవహారాల నుంచి కొంత బయటపడుతున్నట్టుగా ఉన్నారు.
తాజాగా జగన్ మోహన్ రెడ్డి దీక్ష విషయాన్ని జనాల్లోకి తీసుకెళ్లడానికి కొంచెం కొత్త పోకడను అనుసరించారు. జగన్ దీక్షకు మద్దతుగా ప్రత్యేక హోదా అంశం డిమాండ్ తో సెల్పీ వీడియోలను ఆహ్వానించారు వైకాపా వాళ్లు.
ఎలాగూ ఇది సెల్పీల కాలం. అందుకు తగ్గట్టుగా వైఎస్సార్ కాంగ్రెస్ వాళ్లు సెల్ఫీ వీడియోలను పంపమన్నారు. ప్రత్యేకహోదా ఆవశ్యకత గురించి వివరిస్తూ.. నెటిజన్ల సెల్ఫీ వీడియోలు తీసుకొని వాటిని వైకాపాకు వాళ్ల మీడియా సాక్షికి పంపే ఏర్పాట్లు చేసినట్టుగా ఉన్నారు. ఇలాంటి సెల్పీ వీడియోలు ఇప్పుడు ఫేస్ బుక్ లో కనిపిస్తున్నాయి.
కేవలం సాక్షి చదివే వాళ్లకు మాత్రమే కాకుండా ఇప్పుడు జగన్ దీక్ష జరగుతోందన్న విషయం అర్థమవుతోంది. మరి ఇన్ని రోజులుకు అయినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు కొంచెం కొత్తగా ముందుకుపోయినట్టున్నారు. రొటీన్ కు భిన్నంగా ట్రై చేసినట్టున్నారు. 

News Desk-AP
« PREV
NEXT »

No comments

Post a Comment