తాజా వార్తలు

Saturday, 24 October 2015

కె. చంద్రశేఖర రావుతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లోపాయికారి ఒప్పందం...


ఓటుకు నోటు కేసు నుంచి బయటపడడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని, అందుకే కెసిఆర్‌ను చంద్రబాబు అందలమెక్కించారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఒంగోలు పార్లమెంటు సభ్యుడు వైవి సుబ్బారెడ్డి ఆరోపించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా బదులు ప్రధాని నరేంద్ర మోడీ చేత చంద్రబాబు మట్టి, నీళ్లు తెప్పించారని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వ్యాఖ్యానించారు. రాజధాని అమరావతి ప్రాంతంలో చెరుకు పంటలు తగులబెట్టడంపై విచాణ జరిపేందుుక తమ పార్టీ తరఫున ప్రత్యేక బృందాన్ని పంపిస్తున్నట్లు ఆయన తెలిపారు.
News Desk

« PREV
NEXT »

No comments

Post a Comment